మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: డిప్యూటీ సిఎం

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: డిప్యూటీ సిఎం

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: డిప్యూటీ సిఎంప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కె నారాయణస్వామి పేర్కొన్నారు. ఆదివారం గంగాధర నెల్లూరు నియోజక వర్గం, పెనుమూరు మండల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణ లో నాలుగో విడత వైయస్సార్‌ ఆసరా పంపిణీ పండుగ వాతావరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర లో ఇచ్చిన ఎన్నికల హామీలలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల అప్పును నాలుగు విడతల్లో తీర్చారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తూ వైయస్సార్‌ ఆసరా ద్వారా పంపిణీ చేశారన్నారు. మహిళాభ్యుదయమే ధ్యేయంగా పని చేస్తోందని, ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను అర్హులైన వారికి కుల, మత, పార్టీలకతీతంగా పారదర్శకంగా అందిస్తున్నారన్నారు. వైయస్సార్‌ ఆసరా నాలుగో విడత లబ్ధిని మెగా చెక్కు రూపంలో లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు తహశీల్దారు కళావతి, ఎంపీడీఓ నీలకంఠేశ్వర్‌ రెడ్డి, స్పెషల్‌ ఆఫీసర్‌ సుబ్రహ్మణ్యం, ఏపీఎం హరికష్ణ రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ బండి కమలాకర్‌ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️