వీధి కుక్కల దాడిలో 10 గొర్రెల మృతి

Feb 29,2024 11:51 #Chittoor District
10 sheep killed in attack by stray dogs

10 గొర్రెలకు తీవ్ర గాయాలు – లక్ష రూపాయలకు పైగా నష్టం

ప్రజాశక్తి – సోమల : సోమల మండలం పంచాయతీ కేంద్రమైన నంజంపేట గొల్లపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప యాదవ్ కు చెందిన గొర్రెల దొడ్డిలో వీధి కుక్కలు బుధవారం అర్ధరాత్రి ప్రవేశించి 10 గొర్రెలను చంపివేసి పది గొర్రెలను తీవ్రంగా గాయపరిచి దాదాపు ఒక లక్ష 50 వేల రూపాయల నష్టం కలిగించినట్టు బాధితులు తెలిపారు. వీధి కుక్కలు కోతుల బెడద మండలంలో ఎక్కువగా ఉంది. వీటి నివారణకు పంచాయతీ వారు చర్యలు చేపట్టి మూగజీవాలైన గొర్రెలు మేకలు, కోళ్లు చిన్ని చిన్ని దూడలు బలికాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

➡️