పాడి రైతుకు అండగా గోకులం షెడ్లుషెడ్డు నిర్మాణానికి 90 శాతం సబ్సిడీ

పాడి రైతుకు అండగా గోకులం షెడ్లుషెడ్డు నిర్మాణానికి 90 శాతం సబ్సిడీ

పాడి రైతుకు అండగా గోకులం షెడ్లుషెడ్డు నిర్మాణానికి 90 శాతం సబ్సిడీప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ ప్రభుత్వం పాడి రైతులను ఆదుకొనేలా గోకులం షెడ్డ నిర్మాణాకి 90శాతం సబ్సిడీతో షెడ్లు నిర్మాణం చేపట్టి పాడిరైతుకు ప్రోత్సాహం అందిస్తోంది. కుప్పం నియోజవర్గంలో 593 గోకులం షెడ్లు మంజురు చేసింది. జిల్లా వ్యాప్తంగా పాడి రైతుల కోసం పెద్దసంఖ్యలో గోకులం షెడ్లు మంజురు చేయనున్నారు. పాడి రైతుకు కొద్దిపాటి పొలం, షెడు వేసేందుకు స్థలం ఉంటే చాలు రాష్ట్ర ప్రభుత్వం గోకులం పేరుతో ప్రత్యేక పథకం తీసుకొచ్చింది. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో పాడి రైతుల షెడ్ల నిర్మాణానికి సబ్సిడీలో రుణాలు మంజురు చేసింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం మూలనపడింది. కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో గోకులం పేరుతో తిరిగి పాడి రైతు షెడ్లు నిర్మించుకొనేలా 90 శాతం సబ్సిడీతో షెడ్లు నిర్మాణానికి ప్రోత్సాహం అందిస్తోంది. అర్హతలు ఇవే.. గోకులం షెడ్ల నిర్మాణానికి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకందారులు అర్హులు. ఇందులో పశువుల పెంపకందారులకు 90శాతం, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకందార్లకు షెడ్ల నిర్మాణం కోసం 70 శాతం రాయితీలు కల్పించింది. ఉపాధిహామీ పథకంలో జాబ్‌ కార్డులు కలిగిన చిన్న, సన్నకారు రైతులు అర్హులు. షెడ్ల నిర్మాణం కోసం దరఖాస్తులు రైతు సేవా కేంద్రం, మండల వ్యవసాయశాఖ కార్యాలయం, పశు వైద్యశాలల్లో అందుబాటులో ఉంచారు. పూర్తి చేసిన దరఖాస్తులతో పాటు ఆధార్‌కార్టు, షెడ్ల నిర్మాణానికి సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్‌ పత్రాలు, బ్యాంకు పాసు పుస్తకం నకలు సమర్పించాల్సి ఉంటుంది.

➡️