మానవత్వం చాటుకున్న డిజిటల్‌ అసిస్టెంట్‌

Oct 2,2024 21:33
మానవత్వం చాటుకున్న డిజిటల్‌ అసిస్టెంట్‌

– బెంగళూరుకు వెళ్లి వద్ధాప్య పింఛన్‌ అందజేత
ప్రజాశక్తి-సోమల: మండలంలోని అన్నెమ్మగారిపల్లి గ్రామానికి చెందిన భాస్కర నాయుడు అనారోగ్య కారణాలతో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన అక్కడే బంధువుల ఇంటిలో ఉండగా వద్ధాప్య పింఛన్‌ అందించేందుకు సచివాలయానికి చెందిన డిజిటల్‌ అసిస్టెంట్‌ రాజశేఖర్‌ నేరుగా బెంగళూరుకు వెళ్లి లబ్ధిదారుడికి పింఛన్‌ అందజేశారు. దీంతో రాజశేఖర్‌ను పంచాయతీ కార్యదర్శి లలిత కుమారి అభినందించారు.

➡️