వానొచ్చేనా..?ఆకాశం వైపు ఖరీఫ్‌ రైతు ఎదురు చూపు.

వానొచ్చేనా..?ఆకాశం వైపు ఖరీఫ్‌ రైతు ఎదురు చూపు.

వానొచ్చేనా..?ఆకాశం వైపు ఖరీఫ్‌ రైతు ఎదురు చూపు.ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ఏటా ఖరీఫ్‌ రైతులను నిలువునా ముంచుతున్న వర్షం ఈ ఏడాది కూడా ఆలస్యంగా సీజన్‌ మొదలైయ్యేలా ఉండటంతో ఖరీఫ్‌ రైతులు వర్షం కోసం ఆశాకాశం వైపు ఎదురుచూడక తప్పడం లేదు. ఈ ఏడాది మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు.. సరైన కాపు లేదు.. జిల్లాలో మామిడి దిగుబడి పూర్తిగా తగ్గింది.. జిల్లాలో ఎక్కడా మామిడి కాపు కనిపించడం లేదు.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మామిడి దిగుబడి తగ్గడంతో ఖరీఫ్‌పైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. జూన్‌ మొదటి వారం నుండీ ఖరీఫ్‌ సీజన్‌ మొదలు కానుంది. దుక్కులుదున్ని వేరుశనగ విత్తనాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నుండీ సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ ప్రారంభం కాకపోవడంతో ఖరీఫ్‌ రైతుల్లో వేరుశెనగ సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాలో అక్కడక్కడా కురిసిన చిరుజల్లులకు కొన్ని ప్రాంతాల్లోని వేరుశనగ రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఏపి విత్తనాభివృద్ధి ఏపి సీడ్స్‌కు అప్పగించింది. వేరుశనగ విత్తనాలు బహిరంగ మార్కెట్‌లో క్వింటాలు రూ.6,500లకు దోరుకుతున్నాయి. ప్రభుత్వం రూ.9,500లకు కొనుగోలు చేస్తోంది. సరఫరా దారులకు లాభం చేకూర్చేలా ఇలా చేస్తోందంటూ రైతులు మండిపడుతున్నారు. గతేడాది ప్రభుత్వం గుత్తెదారుల నుంచి వేరుశనగ క్వింటాలు రూ.9,300లు కొనుగోలు చేసింది. 40 శాతం రూ.3,700లు రాయితీ రైతుకు చెల్లించాల్సిన నాన్‌ సబ్సిడీ ధర క్వింటాకు రూ.5,580ల ధర ఉండేది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు ప్రభుత్వం వేరుశనగ విత్తన కాయాలను క్వింటాలు రూ.9,500లకు కొనుగోలు చేసి 40శాతం రూ.3,800లు రాయితీపోనూ, రైతులు నాన్‌ సబ్సిడీ క్వింటాలుకు రూ.120ల చొప్పున ఉమ్మడి జిల్లాకు కేటాయించిన వేరుశనగ విత్తనకాయలపై రూ.19.65 లక్షలు అన్నదాతపై భారం పడనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతేడాది 1,88,301 ఖరీఫ్‌ సాధారణ విస్తీరణం కాగా 1,42,744 హెక్టార్లు సాగైంది. రాయితీపై 98,235 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, 78.40 క్వింటాళ్ల మినుముల, 11.52 క్వింటాళ్ల పెసలు, 67,22 క్వింటాళ్ల పచ్చిరొట్టె విత్తనాలు సబ్సిడీపై ఖరీఫ్‌ రైతులకు అందజేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ అలస్యంగా మొదలు కానుండటంతో ఏ మేరకు ఖరీఫ్‌ రైతులు వేరుశనగ సాగుపై పెద్ద ఆసక్తి చూపడం లేదనే చెప్పాలి. ఇప్పటికే మామిడి ఆశించిన స్థాయిలో దిగుబడి కాకపోవడంతో మామిడి రైతులు ఆశాలు వదులుకున్నారు. ఖరీప్‌ వేరుశనగ అయినా ఆదుకోకుంటే జిల్లాలోని రైతుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్న.. దీంతో ఆకాశం వైపు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. .

➡️