కేటాయింపులు సరే.. అభివృద్ధి ఏదీ..?

Nov 28,2024 22:32
కేటాయింపులు సరే.. అభివృద్ధి ఏదీ..?

మౌలిక వసతులకు నోచుకోని మురికి వాడలుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ నగర పాలక సంస్థ ఏటా ప్రకటిస్తున్న కోట్ల రూపాయల బడ్జెట్‌లో నగర అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నట్లు ప్రకటిస్తోంది. రూ.2,70,000వేలకు పైగా ఉన్న చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. ప్రభుత్వం నోటిఫైడ్‌ చేసిన మురికివాడలు 60 వరకు ఉన్నాయి. మురికివాడలను అభివృద్ధి చేసేలా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నారు. అయితే మురికివాడల్లో కనీస మౌలిక వసతులు చూస్తే ఈ నిధులన్నీ ఎక్కడ ఖర్చు చేస్తున్నారనే సందేహాన్ని సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోతోంది. గతేడాది అంటే 2023-24 నగర పాలక బడ్జెట్‌లో మురికివాడల అభివృద్ధి కోసం 24 కోట్ల 60లక్షలకు కేటాయించారు. రంగాల వారీగా చూస్తే షెడ్యూల్డ్‌ కులాల వారికి బడ్జెట్‌లో 15 శాతం రూ.3 కోట్ల 69లక్షలు, షెడ్యూల్‌ తెగలవారికి 7.5 శాతం కోటి 85 లక్షల 50 వేలు, స్త్రీ శిశు సంక్షేమం 5 శాతం కోటి 23 లక్షలు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం 3శాతం 73 లక్షల 80వేలు, గుర్తింపు పొందిన మురికివాడల అభివృద్ధి కోసం 40 శాతం 9 కోట్ల 84 లక్షలు. అయితే ఇవన్నీ కాగితాలకే పరిమితయ్యాయని చెప్పడానికి చిత్తూరు నగరంలోని మురికివాడల్లో మౌలిక వసతులు పరిశీలిస్తే స్పష్టంగా ఇట్టే తెలిసిపోతుంది. నగర పాలక సంస్థ ఏటా బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులు ఆయా రంగాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే చిత్తూరు నగరంలోని మురికివాడలు ఇంతటి దయనీయ పరిస్థితిలో కనిస మౌలికవసతులు లేక అల్లాడాల్సిన పరిస్థితి ఉండేదికాదని మురికివాడల్లో నివశిస్తున్న పేదలు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 శాతం డ్రైనేజీలు లేవు ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశంలోనే చిత్తూరు నగరంలో 50శాతం డ్రైనేజీలు లేని కార్పొరేట్లు గగ్గోలు పెట్టారు. అలాగే నగరం అభివృద్ధి చెందుతున్నా సీసీ రోడ్లు నిర్మాణం లేక మట్టి రోడ్లుపై ప్రయాణాలు చేయాల్సి వస్తోందని, వర్షాల సమయంలో వృద్ధులు, పిల్లలు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ముకివాడల్లో ఖచ్చా రోడ్లు, అస్థవ్యస్థమైన డ్రైనేజి వ్యవస్థ, గుడ్డి దీపాలుగా ఎల్‌ఈడి లైట్లు ఇవ్వన్ని సాక్షాత్తు గత నగర పాలక బడ్జెట్‌ సమావేశంలో కార్పొరేట్లు లేవనెత్తిన సమస్యలే… రామ్‌నగర్‌ కాలనీ…. నగర విస్తరణలో మధ్యతరగతి ఎక్కువగా ఉన్న రామ్‌నగర్‌ కాలనీ విస్తరించింది. దాదాపు నీవానది వరకు నివాసాలు ఏర్పడాయి. విస్తరణలో వీధిలైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక ఇక్కడి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ లేక మురుగునీరు సమీపాల్లోని ఖాళీ ఇంటి జాగాల్లో వదిలేస్తున్నారు. దీంతో దొమలు వృద్ధి చెందిన రోగాలు వ్యాపిస్తున్నాయి. గృహనిర్మాణం అప్రూల్‌, ఇంటి పన్ను, నీటి పన్నులు చెల్లిస్తున్నా నగరపాలక సంస్థ సీసీరోడ్లు, వీధిలైట్లు, డ్రైనేజి కాలువలు ఏర్పాటు చేయకపోడంతో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. డ్రైనేజీ కాలువలు లేక ఇళ్ల మధ్య నిలిచిన మురుగునీరుస్కావెంజర్స్‌ కాలనీ.. ఇక్కడ పారిశుధ్య కార్మికులు అత్యధికంగా ఉండటంతో స్కావెంజర్స్‌ కాలనీ పేరు పెట్టుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేదు. మురుగునీటి కాలువల్లో మురుగు నీరు పారదు. వీధి లైట్లు అంతమాత్రమే. పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాంచాలని దీర్ఘకాలికంగా ఈ కాలనీ వాసులు కోరుతున్నారు. బివిరెడ్డి కాలనీ..వ్యాపారులు, ధనికులు నివాసమున్న బివిరెడ్డి కాలనీలో సైతం సీసీ రోడ్లు లేకపోవడంతో ఇక్కడి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్‌మెంట్లు నిర్మించుకొని వేలకువేలు పన్నులు కడుతున్నా సిసి రోడ్లు వేయడం లేదని ఇక్కడి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌ఈడి పేరిట నగర పాలక సంస్థ విద్యుత్‌ ఆదా పేరిట వందశాతం ఎల్‌ఈడి బల్బులు ఏర్పాటు చేసి చీకట పడ్డాకా.. ఇక్కడ వీధి లైట్‌ ఉంది అని గుర్తించేందుకు తప్పా ఏమాత్రం వెలుతురు లేకపోవడంతో మహిళలు రాత్రి సమయాల్లో వీధుల్లో తిరిగేందుకు భయపడాల్సి వస్తోందటున్నారు. ఓటి చెరువు.. జిల్లా కలెక్టర్‌రేట్‌కు అతిసమీపంలో ఉన్న దళిత కాలనీ ఓటిచెరువు. ఇక్కడ 50 దళిత కుటుంబాలున్నాయి. ఇరుకైన డ్రైనేజీ, మురుగు నీరు పారే అవకాశం లేకుండా చుట్టు ఉన్న అగ్రవర్ణలు వారు గోడ కట్టేయడంతో ఆవాసాల మధ్య మురునీరు నిలిచిపోతోంది. దీంతో ఇండ్ల మధ్య నిలిచిపోయే మురుగునీరు ఎత్తిపోయాల్సి వస్తోందంటున్నారు. డ్రైనేజీని వెడల్పు చేసి మురుగునీరు పారేలా ఏర్పాటు చేయాలని ఇక్కడి దళితులు కోరుతున్నారు. ఇలా పై ప్రాంతాలతో పాటు చిత్తూరు నగరంలోని పెద్ద హరిజనవాడ, రాజీవ్‌ నగర్‌, వీరభద్ర కాలనీ, కైలాస పురం, జానకారపల్లి, ఇరువారం, అంబేద్కర్‌ నగర్‌, పాంచాలిపురం దాదాపు నగర పరిధిలోని మురికివాడలు కనీస మౌలిక వసతులు లేక ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. నగర పాలక సంస్థ ఇప్పటికైనా బడ్జెట్‌లో తమ వాడ అభివృద్ధి కోసం కేటాయించే నిధులు మురికివాడల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేయాలని కోరుతున్నారు.

➡️