ఘనంగా భగత్‌ సింగ్‌ జయంతి వేడుకలు

ఘనంగా భగత్‌ సింగ్‌ జయంతి వేడుకలు ప్రజాశక్తి- పలమనేరు: భగత్‌ సింగ్‌ జయంతి వేడుకలను పలమనేరు సిఐటియు ఆఫీసులో సిపిఎం పట్టణ కార్యదర్శి గిరిధర్‌ గుప్తా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబుల్‌ రాజు, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి అన్నూరు ఈశ్వర్‌ ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా భగత్‌ సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ బ్రిటీష్‌ పాలకులకు ఎదురు నిలిచిన స్వాతంత్య్ర పోరాటంలో వీర మరణం పొందిన యోధులలో భగత్‌ సింగ్‌ ప్రథముడని అన్నారు. భగత్‌ సింగ్‌ దష్టిలో విప్లవం అంటే ప్రజల ద్వారా, ప్రజల కోసం రాజకీయ అధికారాన్ని సాధించడమే అన్నారు. లక్ష్మయ్య, పద్మమ్మ, ఎల్లప్ప పాల్గొన్నారు. కార్వేటినగరం: బ్రిటిష్‌ వారికి భారత యువరక్తం వేడి రుచి చూపిన వీరుడు భగత్‌ సింగ్‌ అని డీఎం.పురం హెచ్‌ఎం కేశవులు పేర్కొన్నారు. శనివారం భగత్‌ సింగ్‌ 118వ జయంతి ఘనంగా నిర్వహించారు. భగత్‌ సింగ్‌ విప్లవ పోరాట విశేషాలను సీనియర్‌ సోషల్‌ ఉపాధ్యాయిని హరిత విద్యార్థులకు వివరించారు. ఉపాధ్యాయులు సరస్వతి, హరిత, మాలతి, సుమతీ, తిరుమలరాజు, సుబ్రమణ్యం రెడ్డి, చిన్నయ్య శెట్టి, వెంకట రమణయ్య, డిల్లిబాబు, రాములు, రంజిత్‌ కుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️