అక్షర యోధుడుకి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ నివాళి

Jun 8,2024 17:05 #Chittoor District
  • రామోజీరావు అస్తమయంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రసాదరావు
  • రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు

ప్రజాశక్తి-చిత్తూరు : ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, మీడియా దిగ్గజం రామోజీరావు చిత్రపటానికి ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ లో మహా న్యూస్ నేతృత్వంలో రామోజీరావుకి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద్ రావు  పాల్గొని.., అక్షర యోధుడికి ఘన నివాళి అర్పించారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ సామాన్య కుటుంబంలో జన్మించి, అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని ఆయన మీడియాకు తెలియజేసారు. ఈ సందర్భంగా అక్షర యోధుడు దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ‘మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేక శకమన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించాలని గుర్తు చేసిన ప్రసాద్ రావు…, ఎన్నో సవాళ్లు, సమస్యలను అధిగమించి ఎవరికీ ఎక్కడా తలవంచకుండా విలువలతో సంస్థలు నడిపిన విధానం అందరికీ ఆదర్శనీయమని రామోజీరావు సేవలను కొనియాడారు. మీడియా రంగంలో ఆయన ఓ శిఖరమని అభివర్ణించారు. రామోజీరావు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే రామోజీరావు  ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు దగ్గుమళ్ళ వెల్లడించారు.

➡️