గ్రామంలో నాగుపాములు కలకలం

Oct 29,2024 22:20
గ్రామంలో నాగుపాములు కలకలం

– భయాందోళనలో ప్రజలు
ప్రజాశక్తి-సోమల: సోమల పంచాయతీ భారతం మిట్ట గ్రామంలో ఇటీవల నాగుపాముల సంచారం అధికం కావడంతో గ్రామస్తులు భయాందోళనలతో బెంబేలెత్తుతున్నారు. వారం రోజుల క్రితం ఓ ఇంటిలోని వంటింట్లో మూడు రోజులుగా తిష్ట వేసిన ఏడు అడుగుల నాగుపామును చూసి కుటుంబ సభ్యులు పాములు పట్టే అతనిని పిలిపించి చాకచక్యంగా పామును పట్టించి ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం మరొకరి ఇంటిలో ఐదు అడుగుల నాగుపాము ఉండగా గుర్తించిన ఇంటిలోని వారు పాములు పట్టే అతనిని పిలిపించి పామును పట్టించేశారు. గత నెల రోజులుగా ఎవరో ఒక ఇండ్లలో నాగుపాములు ప్రత్యక్షం కావడం ఇంటిలోని వారు భయాందోళనలకు గురికావడం ఆపై పాములు పట్టే అతని పిలిపించి పట్టించడం జరుగుతూ వస్తోంది. ఇప్పటికీ ఇండ్లలో చేరిన మూడు పాములను పట్టి దూర ప్రాంతాల్లో వదిలివేయడం జరిగింది. అప్పుడప్పుడు వీధుల్లో కూడా పాములు సంచరిస్తూ ఉన్నాయని ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కావడం లేదని గ్రామస్తులు అంటున్నారు. అదష్టవశాత్తు ఎవరిని ఇంతవరకు పాములు కాటు వేయడం చేయలేదని అంటున్నారు. మళ్లీ ఇంకా ఎవరి ఇంటిలోనైనా పాములు ప్రత్యక్షమవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.

➡️