వినతుల వెల్లువపిజిఆర్‌ఎస్‌కు 248 అర్జీలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

వినతుల వెల్లువపిజిఆర్‌ఎస్‌కు 248 అర్జీలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

వినతుల వెల్లువపిజిఆర్‌ఎస్‌కు 248 అర్జీలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్‌ఎస్‌) అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజాసమస్యల పరిష్కారవేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్‌ హాల్‌లో జిల్లా కలెక్టర్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హిమవంశీ, డిఆర్‌ఓ మోహన్‌ కుమార్‌, ఆర్‌డిఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. పిజిఆర్‌ఎస్‌లో అందిన అర్జీల పరిష్కారప్రగతిని ప్రతివారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీ ఓపెన్‌ అయినట్లైతే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 248 అర్జీలు అందగా శాఖల వారీగా రెవెన్యూ శాఖకు 202, పంచాయతీ రాజ్‌ 2, పోలీస్‌ శాఖ 4, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ 1, డిఆర్‌డిఏ 21, డ్వామా 6, డిఎంఅండ్‌ హెచ్‌ఓ 2, డిసిహెచ్‌ఎస్‌ 3, కాలుష్య నివారణసంస్థ 1, మున్సిపల్‌ కమిషనర్‌ చిత్తూరు 2, ఎంపీడీఓ పెద్దపంజాణి 1, ఎంపీడీఓ తవణంపల్లి 1, గహనిర్మాణ సంస్థ 2 అర్జీలు అందాయి. అలసత్వం చేయకండి: ఎస్పీ సోమవారం జరిగిన ప్రజాఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో ప్రజల నుంచి 33 ఫిర్యాదులను జిల్లా ఎస్‌పి మణికంఠ చందోలు స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్‌పి, డీఎస్పీ టి.సాయినాథ్‌ని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. మొత్తం 33 ఫిర్యాదులు అందాయని తెలిపారు. చీటింగ్‌ 1, కుటుంబ తగాదాలు 5, వేధింపులు 1, ఇంటి తగాదాలు 2, భూ తగాదాలు 11, డబ్బు తగాదాలు 8, ఆస్తి తగాదాలు 3, దారి సమస్యలు 2 ఉన్నాయి.వేగంగా వినతుల పరిష్కారం: కమిషనర్‌ ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందే వినతులను వేగంగా పరిష్కరించాలని కమిషనర్‌ పి.నరసింహ ప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి నగర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు అందించిన వినతులపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతి వినతిపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక సమర్పించాలన్నారు. సోమవారం నాటి పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో రెవెన్యూ 2, ఇంజనీరింగ్‌ 2 చొప్పున మొత్తం 4 ఫిర్యాదులు అందాయి. సహాయ కమిషనర్‌ ఎ.ప్రసాద్‌, ఎంఈ వెంకటరామి రెడ్డి, ఏసీపీ నాగేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. వినతులను స్వీకరిస్తున్న కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌

➡️