నిర్ణీత గడువు లోపు లక్ష్యాలను పూర్తి చేయండి : కలెక్టర్‌ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా సమగ్రాభివద్ధికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద్ రావ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో చిత్తూరు జిల్లా అభివద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లా అభివద్ధికి కావలసిన నిధుల మంజూరుకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపాలని, ప్రతిపాదనలు క్షుణ్ణంగా, శాస్త్రీయంగా తయారు చేయాలన్నారు. వ్యవసాయ, పశు సంవర్థక, ఉద్యాన శాఖలు, రోడ్ల నిర్మాణం, వైద్యరంగాలకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రభుత్వం నుండి అందిన నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకుని జిల్లా అభివద్ధికి కషి చేయాలన్నారు. ఎంఎస్‌ఎంఈ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు చర్యలు చేపట్టాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల పెంపు పై అధికారులు దష్టి పెట్టాలని తెలిపారు. జిల్లాలో అవసరాల మేరకు నిధులు రాబట్టడానికి జిల్లా యంత్రాంగం ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసే పథకాల ద్వారా దారిద్య్రరేఖకు దిగువనున్న వారు అభివద్ధి చెందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలలో రిజర్వేషన్ మేరకు అర్హుల ఎంపిక పక్కాగా చేయాలని తెలిపారు. ఇప్పటికే ఎస్సి, ఎస్టి హ్యాబిటేషన్‌లలో అమలవుతున్న అభివద్ధి పథకాలను వేగవంతంగా నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా సంబంధిత అధికారులు పని చేయాలన్నారు. జల్ జీవన్ మిషన్ అమలు పై సమీక్షించి రానున్న వేసవిని దష్టిలో ఉంచుకుని జిల్లాలోని గ్రామాలలో నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో మామిడితో ఇతర ఉద్యాన పంటల సాగుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను సకాలంలో సద్వినియోగం చేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా కషి చేయాలన్నారు. విద్యాశాఖకు సంబంధించి మెరుగైన విద్యను విద్యార్థులకు అందించేలా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ నరేగా ద్వారా 90 లక్షల పని దినాలు లక్ష్యంగా పెట్టుకుని 75 లక్షల పని దినాలు కల్పించడం జరిగిందన్నారు. మెటీరీయల్ కాంపొనెంట్ కింద రూ.150 కోట్లు మంజూరు చేశామని, ఇందులో రోడ్డు నిర్మాణాలకు సంబంధించి 1600 పనులకు గానూ రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి చెరువుల నిర్మాణం, పైపులైన్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో రెండు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, ఈ నియోజకవర్గాలలో సిసి రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించామని తెలిపారు. వ్యవసాయరంగ అభివద్ధికి రాష్ట్రీయ కషివిజ్ఞాన్ యోజన, ఎంఐడిఎస్, మైక్రో ఇరిగేషన్ ద్వారా చేయూత అందిస్తున్నామని తెలిపారు. మ్యాంగో బోర్డు, కుప్పంలో కేంద్రీయ విద్యాలయం, సెంటర్ ఫర్ సెరికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్‌లు పంపడం జరిగిందన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద రూ.3.50 కోట్ల నిధులు రావడం జరిగిందని, ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎంపి ల్యాడ్స్ కింద రూ.5 కోట్లు మంజూరు కాగా, 60 శాతం పనులు పూర్తి చేశామని, బిల్లులు చెల్లింపు జరుగుతుందన్నారు. జిల్లాకు సంబంధించి సిసి రోడ్లు, కాంపౌండ్ వాల్స్, ఓవర్ హెడ్‌ట్యాంక్స్ నిర్మాణాలు, తాగునీటి సౌకర్యాల పనుల ప్రగతి పై ప్రతినెలా సమీక్షించడం జరుగుతున్నదన్నారు. నరేగా నిధుల ద్వారా క్రీడాభివద్ధికి సంబంధించి ప్రతి పాఠశాలలో ఫూట్ బాల్, వాలీ బాల్ కోర్టులు, పాఠశాల మౌలిక వసతుల ఏర్పాటు, శ్మశానాలలో వసతులు ఏర్పాటు, సిసి రోడ్ల నిర్మాణానికి, అంగన్వాడీ భవనం, మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈసమావేశంలో జెడ్పి సీఈఓ రవికుమార్ నాయుడు, పిఆర్, ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్‌ఈలు చంద్రశేఖర్ రెడ్డి, విజరు కుమార్, డ్వామా, హౌసింగ్ పీడీలు రవి కుమార్, గోపాల్ నాయక్, డీఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసి వెంకటరమణ, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి, జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీ కష్ణ, మధుసూదన్ రెడ్డి, డాక్టర్ ప్రభాకర్, సీపీఓ సాంబశివా రెడ్డి, ఎల్డిఎం హరీష్, జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వరి, డీఎస్‌ఓ శంకరన్, డిఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ సుధారాణి, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
