సమాన పనికి.. సమాన వేతనం ఇవ్వాలి..కలెక్టరేట్‌ ఎదుట కాంట్రాక్ట్‌ వర్కర్లు, ఆశాల ధర్నా

Oct 1,2024 00:50
సమాన పనికి.. సమాన వేతనం ఇవ్వాలి..కలెక్టరేట్‌ ఎదుట కాంట్రాక్ట్‌ వర్కర్లు, ఆశాల ధర్నా

సమాన పనికి.. సమాన వేతనం ఇవ్వాలి..కలెక్టరేట్‌ ఎదుట కాంట్రాక్ట్‌ వర్కర్లు, ఆశాల ధర్నాప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న వివిధ రకాల కాంట్రాక్ట్‌, అవుట్‌ స్సోర్సింగ్‌, గౌరవ వేతనం తీసుకుంటున్న ఉద్యోగులు, డైలీ వేజ్‌, పార్ట్‌ టైం, కంటెంజెంట్‌ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సోమవారం కలెక్టరేట్‌ వద్ద సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ధర్నాకు సిఐటియు జిల్లా అధ్యక్షులు గిరిధర్‌ గుప్తా అధ్యక్షత వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ ప్రభుత్వసంస్థల్లోని కాంట్రాక్ట్‌ అవుట్సోర్సింగ్‌ ప్రభుత్వపథకాల్లో పనిచేస్తున్న వారందరికీ ఎంటిఎస్‌ అమలు చేయాలని, అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసి వారి కుటుంబ సభ్యులలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఉద్యోగులు రిటైర్మెంట్‌ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, ఆరోగ్య బీమా అమలు చేసి కారుణ్య నియామకాలు ఇవ్వాలన్నారు. అలాగే నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, సమగ్ర శిక్ష తదితర అన్ని ప్రభుత్వ పథకాల్లోనే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, డీఏ కల్పించాలని, ఇఎస్‌ఐ పిఎఫ్‌ వర్తింపచేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. 2014 తర్వాత జాయిన్‌ అయిన వారిని మూడు, ఐదు సంవత్సరాలు సర్వీస్‌ ఎప్పుడు పూర్తి అయితే అప్పుడు రెగ్యులర్‌ చేసే విధంగా నిర్దిష్ట విధానాన్ని వెంటనే ప్రకటించాలని, 2014లోగా జాయిన్‌ అయిన వారందరినీ వెంటనే రెగ్యులర్‌ చేసి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అందరికీ రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా గ్రాస్‌శాలరీ చెల్లించాలని, ప్రతినెలా మొదటివారంలో జీతాలు ఇవ్వాలని, వేతన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంగా, నలిని తదితరులు పాల్గొన్నారు.

➡️