ప్రజాశక్తి – రామకుప్పం: మండల అభివద్ధికి కూటమి నేతలు, కార్యకర్తలు పరస్పర సహకారంతో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కషిచేయాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. మంగళవారం రామకుప్పంలో టిడిపి మండల అధ్యక్షుడు ఆనందరెడ్డి జన్మదిన వేడుకలకు ఆయన విచ్చేసి ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు మండలాల వారీగా విరివిగా నిధుల మంజూరుకు కషి చేస్తున్నారన్నారు. పేదరిక నిర్మూలన ధ్యేయంగా మండలంలో పరిశ్రమల ఏర్పాటు, విమానాశ్రయం నిర్మాణం, నిరుద్యోగులకు ఉపాధి, సుబ్రమణ్యస్వామి దేవాలయ అభివద్ధి, రహదారుల ఏర్పాటు, అనేక సంక్షేమ పథకాలతో అభివద్ధి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం కూటమి నేతలు ఆనంద రెడ్డి జన్మదినం సందర్భంగా భారీ ఎత్తున కేక్ కత్తిరించి, దుశ్యాలవాలు కప్పి, పూలమాలువేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర నేతలు మునస్వామి, నారాయణ చారి, అంజనేయరెడ్డి, నరసింహులు, రామ్మూర్తి, సీతాపతి, చిన్ని కష్ణ చలపతి, గంట్లగౌడు, నందారెడ్డి, సుబ్రీ, విజరు రెడ్డి, బాలు, సలాంసాబ్, రఫీ, వెంకటాచలం, వెంకటరమణ, ఆదిల్, మంజునాథ్ పాల్గొన్నారు.