ప్రజాశక్తి-బంగారుపాళ్యం: తెలుగు తమ్ముళ్లకు పార్టీ సభ్యత్వంతో ఆదరణ అని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ అన్నారు మంగళవారం మండలంలోని కొదలమడుగు, రాగిమనిపెంట గ్రామాల్లో టిడిపి సభ్యత కార్యక్రమం మండల అధ్యక్షులు జయప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వానికి వంద రూపాయలు చెల్లించి సభ్యత్వం పొందాలని సభ్యత్వం పొందిన వారు పార్టీలో కీలకంగా పాల్గొని కార్యకలాపాలు చేపట్టాలని ప్రమాదవశాత్తు జరిగిన నష్టానికి ఐదు లక్షల రూపాయల వరకు భీమా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ ధరణి, సర్పంచులు ప్రకాష్ నాయుడు, మురళి, నాయకులు మహేంద్ర, నాగరాజు గౌడ్, బాలకష్ణ, శ్రీనివాసులు, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.