ఇసుక అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలిపవర్లూమ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు

ఇసుక అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలిపవర్లూమ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు

ఇసుక అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలిపవర్లూమ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజుప్రజాశక్తి- విజయపురం (నగరి): నగిరి ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు శనివారం విలేకరుల సమావేశంలో డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా ధరణి ఊరి దగ్గర ఇసుక అక్రమ రవాణాను ప్రజలు అడ్డుకున్న సందర్భంగా వారిపై దౌర్జన్యం చేశారని, ఈ ఘటన పై జిల్లా ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయినా ఇసుక అక్రమ రవాణా ఆగకుండా నిరంతరం కొనసాగుతూనే ఉందని అన్నారు. ఇసుకను అక్రమంగా తరలించడం వలన చుట్టుపక్కల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా వేలాది మంది పవర్లూమ్‌ కార్మికులు గతంలో పెద్దఎత్తున పోరాటం చేసిన ఫలితంగా కూలి రేట్లు పెంచినా అది ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే పోరాట శిబిరం వద్దకు వచ్చి తాము వచ్చిన వెంటనే కూలి రేట్లు పెంచుతామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వందరోజుల పూర్తవుతున్నా ఇప్పటివరకు దీని ఊసే లేదని అన్నారు. అంతేకాకుండా నగరి ప్రాంతంలో ఉన్న ప్రజాసమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలు చేస్తామని తెలిపారు. సమావేశంలో సిపిఎం నాయకులు పెరుమాళ్‌, తంగరాజు, మైల్‌స్వామి, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.

➡️