కార్మికులపై వేధింపులు మానుకోవాలి: సీపీఎం

కార్మికులపై వేధింపులు మానుకోవాలి: సీపీఎం

కార్మికులపై వేధింపులు మానుకోవాలి: సీపీఎంప్రజాశక్తి-విజయపురం(నిండ్ర): ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులపై వేధింపులు, తొలగింపులు మానుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్‌ చేశారు. బుధవారం నిండ్ర మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ మార్గం చూపుతున్న సీపీఎం విధానాలను ప్రజలందరూ బలపరచాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో అనేక ప్రజా పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. నిండ్ర షుగర్‌ ఫ్యాక్టరీ మూతబడినప్పుడు, ఆ తర్వాత జరిగిన పోరాటాల్లో సీపీఎం రైతులకు అండగా నిలిచిందన్నారు. పేదల నివసిస్తున్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 26, 27తేదీల్లో చిత్తూరులో జరగనున్న సీపీఎం జిల్లా మహా సభలను జయప్రదం చేయాలని కోరారు. అనం తరం నిండ్ర మండల సీపీఎం శాఖ కార్యదర్శిగా సంతోష్‌ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు ఓబుల్‌ రాజు, మండల సీనియర్‌ నాయకులు చిరంజీవమ్మ, మల్లికా తదితరులు పాల్గొన్నారు.

➡️