గ్రామీణ విద్యార్థుల అభివద్ధే లక్ష్యం

Oct 2,2024 21:31
గ్రామీణ విద్యార్థుల అభివద్ధే లక్ష్యం

ప్రజాశక్తి-పూతలపట్టు: గ్రామీణ విద్యార్థుల అభివృద్ధే లక్ష్యంగా తోడ్పాటు అందిస్తామని అమర రాజా సంస్థల అధినేత గల్లా రామచంద్ర నాయుడు అన్నారు. మండలంలోని పేట మిట్ట గ్రామంలోని మంగళ్‌ విద్యాలయం పాఠశాలలో బుధవారం 49వ శ్రీకష్ణదేవరాయ విద్యా సాంస్కతిక సంఘ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ కలిగిన ఎంతోమంది పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే నెపంతో పాటూరి రాజగోపాల్‌ నాయుడు స్ఫూర్తితో శ్రీకష్ణదేవరాయ విద్యాసాంస్కతిక సంఘాన్ని స్థాపించామన్నారు. అందులో ఎంతో మంది దాతలను భాగస్వాములుగా చేసి, పదవ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, సిఏ మొదలైన కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన 200మంది విద్యార్థులకు రూ.40లక్షల ఉపకార వేతనాలను అందించడం జరిగిందన్నారు. అనంతరం మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ ఇటీవల తాను రాసిన స్వీయ చరిత్ర పుస్తక ఆవిష్కరణ జరిగిందన్నారు. ఆ పుస్తకం మొదటి ముద్రణలోని 5000 పుస్తకాలు అమ్ముడైనట్లు వివరించారు. ఆ పుస్తకాల ద్వారా వచ్చిన నగదు రూ.50లక్షలను పేద విద్యార్థుల చదువుకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఆ మొత్తాన్ని ట్రస్టుకు విరాళంగా అందిస్తున్నట్లు చెప్పారు. ఆ సొమ్ము ఐదువేల మంది చేతుల ద్వారా విరాళంగా అందించారని ఇందులో సీఎం చంద్రబాబు డబ్బులు కూడా ఉన్నట్టు తెలిపారు.

➡️