గ్రామీణ బ్యాంక్ జోనల్ బ్రాంచ్‌ని తరలించవద్దు రాయలసీమ అభివృద్ధి వేదిక డిమాండ్ ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: రాయలసీమ జిల్లాలో సప్తగిరి గ్రామీణ బ్యాంకు జోనల్ బ్రాంచ్ కడపలో ఉన్నదాన్ని అమరావతికి తరలించాలని ఆలోచన విరమించుకోవాలని శనివారం రాయలసీమ అబివృద్ధి వేదిక డిమాండ్ చేసింది. ఈసందర్భంగా అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది. రాయలసీమ అభివృద్ధి వేదిక చిత్తూరు జిల్లా కన్వీనర్ వాడ గంగరాజు మాట్లాడుతూ రాయలసీమ ఇప్పటికీ వెనుకబడిందని విభజన చట్టంలో హామీలు ఏవీ కూడా రాయలసీమలో అమలు కావడం లేదని విమర్శించారు. ఇక్కడున్న ఆఫీసులను కూడా అమరావతికి తరలిస్తే రాయలసీమను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేతులెత్తేశారని, కనీసం ఉన్న కార్యాలయాలను కూడా తరలించడం ఏమిటని ప్రశ్నించారు. ఇవైనా ఉండడం వల్ల రవాణా ఉపాధి ఇతర సౌకర్యాలు ప్రజలకు కొంత వరకు అందుతున్నాయని, బయటకు తరలిపోతే ఇక్కడ అన్ని రకాలుగా వెనుకపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ గ్రామీణ స్థాయిలో మహిళలకు అనేక రకాల పొదుపు రుణాలు ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, ఇలాంటివి అందుబాటులో ఉండాలి కానీ వాటిని దూరం ప్రాంతాలకు తరలించేలే చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. మరిన్ని కార్యాలయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి రాయలసీమ అభివృద్ధి కోసం ప్రభుత్వం కషి చేయాలని డిమాండ్ చేశారు. సప్తగిరి గ్రామీణ బ్యాంకు జోనల్ కార్యాలయం కడపలోనే ఉండేవిధంగా చర్యలు తీసుకోకపోతే రాయలసీమ జిల్లాలోని అన్ని చోట్ల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల, అభివృద్ధి వేదిక నాయకులు నాగరాజు, సురేంద్ర, బాల సుబ్రమణ్యం, మనీ పాల్గొన్నారు
