స్వామి కన్నన్‌ కు డాక్టరేట్‌

స్వామి కన్నన్‌ కు డాక్టరేట్‌

స్వామి కన్నన్‌ కు డాక్టరేట్‌ప్రజాశక్తి- వి కోట: మండల కేంద్రమైన వీకోటలోని బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు స్వామి కన్నన్‌కు ఎస్‌వి యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. బాలుర ఉన్నత పాఠశాల సోషియల్‌ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న స్వామి కన్నన్‌ మారుమూల ప్రాంత పేదవిద్యార్థులకు విద్యను అందించడం ద్వారా వారిలో నైపుణ్యాన్ని పెంపొందించి చైతన్యం తీసుకురావడానికి వారు విశేషంగా కషి చేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్విద్యాలయంలో రాజనీతి శాస్త్రం, ప్రభుత్వ పాలనా శాస్త్రం విభాగంలో ‘ది రోల్‌ ఆఫ్‌ సర్వ శిక్షా అభియాన్‌ ఇన్‌ ఇంప్రూవింగ్‌ క్వాలిటీ ఎడ్యుకేషన్‌: ఎ కేస్‌ స్టడీ ఇన్‌ చిత్తూర్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అనే అంశంపై పిహెచ్‌డి గ్రంథం సమర్పించినందుకు గాను వర్సిటీ కన్నన్‌కి డాక్టరేట్‌ ప్రధానం చేశారు. ఈ పరిశోధన ఆచార్య బివి.మురళీధర్‌ పర్యవేక్షణలో సాగింది. ఇతను 2013 యస్‌వియు రీసెట్‌ నందు మొదటి ర్యాంకు సాధించి అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనా పత్రాలు, సదస్సులలో పాల్గొని అనేకుల మన్ననలు పొందారు. ఇతనికి డాక్టరేట్‌ ప్రదానం చేయటం పట్ల పురప్రముఖులు అభినందనలు తెలిపారు.

➡️