సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు
ప్రజాశక్తి-చిత్తూరు : భోగి పండుగ పురస్కరించుకొని ప్రజలందరూ పాత వస్తువులను భోగి రూపంలో దగ్ధం చేసి కొత్త వెలుగులు కోసం ఎదురుచూస్తారు. ఆ విధంగా విద్యుత్ చార్జీలను పెంచకూడదని విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో దగ్దం చేసే కార్యక్రమం విస్తృతంగా చేయాలని సిపిఎం జిల్లా కమిటీ పిలుపునివ్వగా జిల్లా వ్యాప్తంగా 25 చోట్ల దగ్ధం చేసే కార్యక్రమం చేసినట్టు సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చిత్తూరు బంగారుపాలెం పోతులపట్టు పలమనేరు గంగవరం పొంగనూరు నగరి నిండ్ర తదితర ప్రాంతాల్లో సిపిఎం నాయకులు ప్రజా సంఘాల నాయకులు ప్రజలతో కలిసి భోగిమంటల వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అదనపు విద్యుత్ బారాలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలను యధాతరంగా ఉంచుతున్నట్లు చూపారని అయితే ప్రతి నెల వసూలు చేస్తున్న 40 పైసలు 2025- 26లో రద్దు చేస్తున్నట్లు స్పష్టంగా ఎక్కడ చెప్పలేదని తెలిపారు. 2025- 26 సంవత్సరంలో ప్రజలపై భారం ఉంటుందని స్పష్టంగా అర్థం అవుతున్నది. 2025- 26 సంవత్సరానికి రెవెన్యూ గ్యాప్ 5538 కోట్లు చూపించారు. ఈ మొత్తాన్ని చార్జీల రూపంలో వసూలు చేయాలనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ భారం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. టైం ఆఫ్ డే విధానాన్ని సిపిఎం వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. రోజుకు 24 గంటలలో పీకవర్స్ ఎనిమిది గంటలు ఆఫ్ పీకావర్స్ 11 గంటలు నార్మల్ అవర్స్ 5:00 అని చెప్పి విభజన చేసి సామాన్యులు వాడే సమయంలో కరెంటుకు అదనంగా డిస్కం వసూలు చేయడానికి ప్రతిపాదించడం దారుణం అన్నారు.స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనను రద్దు చేయాలని, టైమ్ ఆఫ్ డే టారీకు విధానాన్ని అమలు చేయటం, చార్జీలు వసూల్లో పారదర్శకత లేకపోవడం ప్రిపైడ్ విధానాన్ని కలిగి ఉండడం తదితర కారణాల రీత్యా స్మార్ట్ మీటర్ లను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గిరిధర్ గుప్తా, ఓబుల్ రాజు మురళి ఈశ్వరయ్య రాజా జయంతి జ్యోతి వినోద్ పెరుమాళ్ సంతోష్ చిరంజీవి అమ్మ రమణ తదితరులు పాల్గొన్నారు.