పంట పొలాలపై ఏనుగుల దాడి

పంట పొలాలపై ఏనుగుల దాడి

పంట పొలాలపై ఏనుగుల దాడిప్రజాశక్తి- వీకోట: మండల పరిధిలోని అటవీ సరిహద్దు ప్రాంతమైన నాయకనేరి గ్రామసమీపంలోని పంట పొలాలపై ఏనుగులు దాడులకు పాల్పడ్డాయి. బుధవారం అర్ధరాత్రి అటవీ ప్రాంతం నుంచి పంట పొలాల్లోకి చొరబడ్డ మూడు ఏనుగులు కోతకొచ్చిన వరి, అరటితో పాటు టమోటా తోటలను తిని తొక్కి నాశనం చేశాయి. నాయకనేరికీ చెందిన ఇర్షాడ్‌ అహ్మద్‌ అరటి తోటను కాయదశలో మొక్కల్ని విరిచి నష్టపరిచాయి. అటవీ సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల సంచారం ఉండే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటీవీశాఖ అధికారులు ప్రజలను హెచ్చరించారు. ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.

➡️