పంటలపై ఏనుగుల దాడి

పంటలపై ఏనుగుల దాడి

పంటలపై ఏనుగుల దాడిప్రజాశక్తి- బైరెడ్డిపల్లి: మండలంలోని కుప్పనపల్లి, కడపనతం, పాతపేట గ్రామాలలో ఆదివారం రాత్రి రెండు ఏనుగులు పంటలపై దాడి తిని, తొక్కి నాశనం చేశాయి. తిమ్మరాయప్పగారి భాస్కర్‌కు చెందిన 57 సెంట్ల టమోటా, శివలింగప్ప గౌండర్‌కు చెందిన 63 సెంట్ల రాగి పంటలను పూర్తిగా ధ్వంసం చేశాయని, నాగేంద్ర అనే రైతు పంటకు వేసిన కంచెను, వాటర్‌ పైపులను తొక్కినాశనం చేశాయని తెలిపారు. సోమవారం ఉదయం ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ సుమ ఏనుగుల దాడిలో రైతులను జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. పై అధికారులకు నివేదికను పంపనున్నట్లు తెలిపారు. డిపిఆర్‌ఓ వేణుగోపాల్‌ రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️