పంటలపై ఏనుగుల దాడి- వరి, టమోట, మామిడి పంటలకు తీవ్ర నష్టం

పంటలపై ఏనుగుల దాడి- వరి, టమోట, మామిడి పంటలకు తీవ్ర నష్టం

పంటలపై ఏనుగుల దాడి- వరి, టమోట, మామిడి పంటలకు తీవ్ర నష్టంప్రజాశక్తి-సదుం: మండల పరిధిలోని జోగివారిపల్లి పంచాయతీ పరిధిలోని బత్తలవారిపల్లి, జోగివారిపల్లి గ్రామాల రైతుల పంట పొలాలపై గత శుక్రవారం రాత్రి ఏనుగులు గుంపు పడి పంటలకు తీవ్ర నష్టం కలిగించిన విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా వున్నాయి.. బత్తలవారిపల్లి, జోగివారిపల్లి గ్రామాలకు చెందిన రైతులు నరసింహా రెడ్డి, రెడ్డెప్ప రెడ్డి, జ్యోతి, సురేష్‌ రెడ్డి రఘు అనే రైతులు వేసుకొన్న వరి, టమోటా, మామిడి, జొన్న తదితర పంటలపై ఏనుగులు గుంపు పడి తీవ్ర నష్టం కలిగించినట్లు రైతులు విలేకరులకు తెలిపారు. అంతే కాకుండా పంట పొలాలకు రక్షణగా ఏర్పాటు చేసుకొన్న రాతి కూసాల పెంచింగ్‌ను విరగగొట్టి, తోటలోకి ప్రవేశించి, పంటలను తొక్కి నాశనం చేశాయని రైతులు వాపోయారు. పంటలకు నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైపులను పెరికేసి, ధ్వంసం చేశాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నైనా అటవీ శాఖా అధికారులు తగు చర్యలు తీసుకొని ఏనుగుల గుంపును పంట పొలాలు వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.

➡️