కోరిన వారందరికీ ఉపాధి పనులు

Oct 2,2024 21:34
కోరిన వారందరికీ ఉపాధి పనులు

– గ్రామ సభలో ఏపీడీ శోభన్‌ బాబు
ప్రజాశక్తి-కార్వేటినగరం: కోరిన ప్రతి కూలీకి ఉపాధి పనులు కల్పిస్తామని అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శోభన్‌ బాబు అన్నారు. బుధవారం కార్వేటినగరంలో సర్పంచ్‌ ధనుంజయవర్మ అధ్యక్షతన గ్రామ సభను ఎంపిపి లతబాలాజీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ పల్లెల్లో పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ప్రతి కూలీలకు పనులు కనిపించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గాంధీజీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయాలని ఇన్‌ఛార్జ్‌ ఎంపిడిఓ లక్ష్మీపతి అన్నారు. టిడిపి నాయకుడు రవి యాదవ్‌ మాట్లాడుతూ స్థానిక ఆలయం నుంచి డ్రైనేజ్‌ కాలువలు నిర్మించాలని అధికారుల దష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా పద్మ సరస్సు జగనన్న కాలనీలో నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయలేదని ఉద్యోగులకు, అనర్హులకు మంజూరు చేశారని దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎంపీడీవోని కోరారు. ఉపాధి కూలీలకు పనులు గుర్తించి వాటిని కూలీలకు అప్పగిస్తామని ఏపీఓ జాహ్నవి అన్నారు. అనంతరం ఎంపీపీ లతబాలాజీ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. చెత్తాచెదారం లేకుండా అందరూ కలిసిమెలిసి మండలాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సర్పంచ్‌ ధనంజయ వర్మ మాట్లాడుతూ రోడ్డుపైన చెత్తను వేయకుండా తమ ఇంటి వద్ద చెత్త సేకరణ వాహనం వచ్చినప్పుడు అందులో వేయాలన్నారు. కార్యక్రమంలో ఏటీఎం కవిత, హౌసింగ్‌ ఎఈ రాఘవయ్య, ఈవో మణి, సిబ్బంది పాల్గొన్నారు.

➡️