ఃచిత్తూరులో కొత్త మెడికల్‌ కళాశాల ఏర్పాటుః

ఃచిత్తూరులో కొత్త మెడికల్‌ కళాశాల ఏర్పాటుఃప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ వెల్లూరు, చిత్తూరు క్యాంపస్స్‌లో కొత్త మెడికల్‌ కళాశాల, టీచింగ్‌ హాస్పిటల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు అజీమ్‌ ప్రేమ్‌ ఫౌండేషన్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అనురాగ్‌ బెహర్‌, సిఎంసి వెల్లూరు డైరెక్టర్‌ డాక్టర్‌ విక్రమ్‌ మాథ్యూస్‌ తెలిపారు. బుధవారం వారు చిత్తూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన వారికి ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్యను అందించడానికి, అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌తో భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా మెడికల్‌ కళాశాలని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఉన్న 120పడకల ఆసుపత్రిని 402పడకలతో బోధనాసుపత్రిగా మార్చనున్నట్లు తెలిపారు. సిఎంసి వెల్లూరుకు రూ.500కోట్లు గ్రాంటు మంజూరు చేసిందన్నారు. ఈ గ్రాంట్‌ వైద్య విద్యలో అగ్రగామిగా ఉన్న సీఎంసీ వెల్లూరు ఎంబిబిఎస్‌ విద్య భారతీయ ఆరోగ్య సంరక్షణ రంగంలో విస్తరిస్తున్న అసమానతలను పరిష్కరించడానికి ప్రాథమిక, ద్వితీయ ఆరోగ్య సంరక్షణ, క్రమశిక్షణపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఃఃచిత్తూరు క్యాంపస్‌లోని కొత్త మెడికల్‌ కళాశాల, టీచింగ్‌ హాస్పిటల్‌ మన దేశ అర్థిక సామాజిక వనరుల పరిమితులకు సున్నితమైన వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణ, పరిశోదన ప్రతిరూప నమూనాను అందించనున్నట్లు చెప్పారు.

➡️