మరుగుదొడ్లు నిర్వహణ లేక విద్యార్థులకు అవస్థలు
మౌలిక వసతుల కల్పనలో అదే నిర్లక్ష్యం
బడుల్లో అస్తవ్యస్తంగా పిల్లల పరిస్థితి
ప్రజాశక్తి-వెదురుకుప్పం: ప్రభుత్వ బడుల్లో తగినన్ని మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అరకొర వసతులతో కాలం వెల్లదీస్తున్న పరిస్థితి దాపరించింది. కనీసం మరుగుదొడ్లు నిర్వహణ లేక ఇబ్బందులు తప్పడం లేదు. పాఠశాలల్లో కనీస నీటి సౌకర్యం కూడా లేని దుస్థితి ఏర్పడింది. ఆరుబయటనే మూత్ర విసర్జనకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎవరినడగాలో.. ఎవరితో చెప్పాలో కూడా తెలియని చిన్నతనంలో ఆ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి తగు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఓ సామాజిక వేత్త ఇటీవల నిర్వహించిన సర్వేలో నిజాలు వెలుగుచూశాయి. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన తెలుసుకున్నట్లు చెప్పారు.30కిపైగా పాఠశాలల్లో ఇదే పరిస్థితి.. వెదురుకుప్పం మండలంలోని 30కు పైగా పాఠశాలలో అరకొర సదుపాయాలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కనీసం నీటి సౌకర్యం కూడా లేకపోయింది. మరుగుదొడ్లు నిర్వహణ లేక, పట్టించుకొనే వారు లేక పాఠశాల పిల్లలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా గొడుగుచింత, సద్దికూళ్లపల్లి, ఎర్రగుంట ప్రాథమిక పాఠశాలల్లో పూర్తిగా మరుగుదొడ్లు సౌకర్యం లేదు. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.మండలంలో మొత్తం పాఠశాలలు 81ప్రాథమిక పాఠశాలలు 68ప్రాథమికోన్నత పాఠశాలలు 4ఉన్నత పాఠశాలలు 9విద్యార్థుల సంఖ్య 2871మౌలిక సదుపాయాలు కల్పించాలి పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించి మెరుగైన విద్యాను అందించాలి. మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకురావాలి. నీటి సౌకర్యం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. విద్యాభివృద్ధికి పాలకులు పార్టీలకతీతంగా పనిచేయాలి.- వాసుదేవ రెడ్డి, పచ్చికాపల్లం, వెదురుకుప్పం మండలంజిల్లా అధికారులకు నివేదిక పంపించాం.. వివిధ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని మాట వాస్తవమే. నాడు-నేడు ద్వారా చాలా వరకు పాఠశాలల్లో మరమ్మతులు జరిగాయి. విద్యార్థులకు ఇబ్బంది ఉన్న చోట మరమ్మతులు, నూతన మరుగుదొడ్లు నిర్మాణం, నీటి సౌకర్యం ఏర్పాటుకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం.- మహేశ్వర రాజు, ఎంఈవో, వెదురుకుప్పం మండలం