బ్యాంకు ఛైర్మన్ ఏఎస్‌ఎస్ ప్రసాద్
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం అధికారులు, సిబ్బంది చిత్తూరు నగరంలో మూడు కిలోమీటర్ల వాకథాన్ నిర్వహించారు. అవినీతికి వ్యతిరేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం నుండి శాఖ వరకు మంగళవారం మూడు కిలోమీటర్ల మేర వాకథాన్ నిర్వహించారు. కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ ఏఎస్‌ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని, రోజువారీ కార్యక్రమాల్లో ఎటువంటి అవినీతి ఈ ఆస్కారం లేని విధంగా జాగ్రత్త వహించాలని సూచించారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న వారందరికీ అవినీతిరహిత వ్యవహారంలో సాధారణమైనప్పటికీ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సప్తగిరి గ్రామీణ బ్యాంకు నిర్దేశించిన వ్యాపార లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకు ఉద్యోగులు కషి చేయాలన్నారు. ఈ ప్రయాణంలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఉమ్మడిగా కషిచేసి జిల్లాలోని అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మెరుగైన బ్యాంకింగ్ సదుపాయాలను అందజేస్తున్నామని తెలియజేశారు. కొత్తగా బ్యాంకు ప్రవేశపెట్టిన దీన దయాల్ బంగారు ఆభరణాల రుణ పథకం ద్వారా వెనుకబడిన తరగతుల ఖాతాదారులకు కేవలం 6శాతం వడ్డీకి రుణం మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం చాలా విశిష్టమైందని అన్నారు. బ్యాంకు విజిలెన్స్ అధికారి రమణయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహణకు అనుమతులు ఇచ్చిన మున్సిపల్, పోలీస్ అధికారులకు కతజ్ఞతలు తెలియజేశారు. జనరల్ మేనేజర్ ప్రభాకరన్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రామకష్ణ, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.