రెవెన్యూ సమస్యలపై దృష్టి పెట్టాలి

Nov 12,2024 22:55
రెవెన్యూ సమస్యలపై దృష్టి పెట్టాలి

శ్రీ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక బందాలు
శ్రీ జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌
ప్రజాశక్తి- వి కోట రెవెన్యూ సమస్యల పరిష్కారం పట్ల తహశీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలని, సత్వరమే స్పందించాలని జిల్లా కలెక్టర్‌ సమిత్‌ కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం పలమనేరు ఆర్‌డిఓ కార్యాలయంలో కలెక్టర్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరితో కలిసి కుప్పం, పలమనేరు నియోజకవర్గాల ఆర్‌డిఓలు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణ బదిలీలు-2024 తర్వాత తహశీల్దార్లందరూ తమ మండలాల్లోని క్షేత్రస్థాయిలో పర్యటించి రెవెన్యూ అంశాలపై పూర్తి అవగాహన చేసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి వెంటనే స్పందించి అందుకు సంబంధించిన రికార్డులను సిద్ధం చేసుకుని వివరాలను కోర్టులో ఫైల్‌ చేయాలన్నారు. తహశీల్లార్లు వ్యక్తిగతంగా కోర్టు కేసులలో హాజరు కావాలని, లేనిపక్షంలో డిప్యూటీ తహశీల్దార్‌, మండల సర్వేయర్లు హాజరై పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్‌ఓఆర్‌ అప్పీల్స్‌ను ప్రతి వారం కనీసం 5 నుండి 10 కేసులను పరిష్కరించాలని, యాక్టివ్‌ కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని, రీసర్వే, గ్రామసభలు 90శాతం ఎక్స్టెంట్‌, జాయింట్‌ ఎల్‌పిఎంల ఫిర్యాదులు వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. రెవెన్యూ ఫిర్యాదులను పరిష్కరించడానికి 3నెలల షెడ్యూల్‌ను రూపొందించి స్థిరమైన పరిష్కారాల కోసం బందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ తెలిపారు. డిఆర్‌ఓ కె.మోహన్‌ కుమార్‌, పలమనేరు, కుప్పం ఆర్‌డిఓలు భవాని, శ్రీనివాస్‌ రాజు, డిఎస్‌ఓ శంకర్‌, తహసిల్దార్లులు, డీటీలు పాల్గొన్నారు.

➡️