హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం పదేండ్ల బాలుడు మృతి ప్రయాణికులు నలుగురు అక్కడికక్కడే మృతి మరో 15 మంది గాయపడ్డారు. ప్రజాశక్తి విజయపురం నగరి ఘోర రోడ్డు ప్రమాదము చెన్నై తిరుపతి వెళ్లే హైవేపై రాత్రి 9 గంటల పది నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నాగులూరు ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది గాయపడ్డారు. 1.ఎం.ధనుష్(10) ూ/0 మణిగండ తిరుపతి 2.పార్థసారథి (70)ూ/0 లెట్ నాగమ నాయుడువడమలపేట 3.రాజేంద్ర నాయుడు 55ూ/0 కోదండ నాయుడు వదమలపేట4.కుమార్ (55)సుబ్రమణినెహ్రూ నగర్ తిరుత్తణి .నగరి ఏరియా హాస్పిటల్కు తరలించి చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి 9:10 నిమిషాలకు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం భారతి బస్సు తిరువళ్లూరు నుండి తిరుపతికి వెళుతుండగా అందులో సుమారు 50 మంది ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తుంది. నగరి సాయిబాబా గుడి సమీపంలో భారతి బస్సు డ్రైవర్ ఎదురుగా వెళుతున్న లారీని ఓవర్ ట్రాక్ చేస్తుండగా తిరుపతి నుండి తమిళనాడుకు పోవడానికి ఎదురుగా వస్తున్న లారీని చూడకుండా ఓవర్ ట్రాక్ చేయడానికి ప్రయత్నించగా ఎదురుగా వస్తున్న లారీ భారతి బస్సును ఢీకొనడమే ప్రధాన కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో బస్సులో ప్రయాణించిన వారిలో పలువురు మృతి చెందగా, మరి కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.లిప్రయాణికుల్లో ఎక్కువగా..లిఈ ప్రమాద ప్రయాణికులలో ఎక్కువ మంది తమిళనాడుకు చెందినవారుగా తెలుస్తోంది.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డి.ఎస్.పి, ఆర్డిఓ, సీఐ,ఎమ్మార్వో సంఘటన స్థలానికి చేరుకున్నారు.లిమరింత పెరిగే అవకాశంలిసమాచారం ప్రకారం గాయపడిన ప్రయాణికులను పోలీసులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా బస్సుకు తీవ్ర నష్టం జరిగింది. దీంతో పాటు అనేక మంది ప్రయాణికులకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలంలో అధికారులు వేగంగా స్పందించారు. వారి యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.లిప్రమాదానికి కారణమిదేనా..లి భారతి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే, వేగంగా పోవడమే దీనికి ప్రధాన కారణమని ప్రయాణికులు అక్కడ ఉన్న స్థానికులు చెబుతున్నారు.అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి చర్యలు తీసుకునే అంశాలపై యత్నిస్తున్నారు.
హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం పదేండ్ల బాలుడు మృతి ప్రయాణికులు నలుగురు అక్కడికక్కడే మృతి మరో 15 మంది గాయపడ్డారు.
