వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిట్రాక్టర్‌ను ఢకొీన్న లారీ- ఇద్దరు మతి – ఆరు గురికి గాయాలు

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిట్రాక్టర్‌ను ఢకొీన్న లారీ- ఇద్దరు మతి - ఆరు గురికి గాయాలు

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిట్రాక్టర్‌ను ఢకొీన్న లారీ- ఇద్దరు మతి – ఆరు గురికి గాయాలుప్రజాశక్తి-చిత్తూరుడెస్క్‌: ట్రాక్టర్‌ను ఢకొీన్న లారీ ఇద్దరు మతి ఆరు మందికి గాయాలైన సంఘటన బుధవారం రాత్రి మొగిలి సమీపంలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మయ్య సమాచారం మేరకు.. కీరమంద గ్రామానికి చెందిన నాగభూషణం, రాజయ్య, జయచంద్ర, బాబు, వేణు, రాజులు గ్రామంలో వరిగడ్డి తీసుకొచ్చేందుకు సదుం వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా వెనక నుంచి వస్తున్న లారీ ట్రాక్టర్ను ఢకొీంది. అందులో వస్తున్న ఆరు గురికి లారీ డ్రైవర్‌ భద్రాచలం చెందిన రామారావుకు తీవ్ర గాయాలు కాగా ప్రథమ చికిత్స కోసం పలమనేరు బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంగారుపాలెంలో జగన్నాధం కుమారుడు రాజు రాజమాణిక్యం కుమారులు వేణులు మతి చెందారు. గాయాలైన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: చిత్తూరు రూరల్‌ మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. గంగాధర్‌ నెల్లూరు మండలం ఆవులకొండ గ్రామానికి చెందిన అజరాలి, ఘజియాబాషా ఇద్దరు యువకులు చికెన్‌ దుకాణంలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై తమ గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో బంగారురెడ్డిపల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీ మోటార్‌ సైకిల్‌ను ఢ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బిఎన్‌ఆర్‌ పేట ఎస్‌ఐ వెంకట సుబ్బమ్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️