పూర్తి.. 90 శాతం పెన్షన్లు

పూర్తి.. 90 శాతం పెన్షన్లు

పూర్తి.. 90 శాతం పెన్షన్లు ప్రజాశక్తి- గంగాధర నెల్లూరు: మండలం లోనినెల్లెపల్లి పంచాయతీ నెల్లేపల్లి గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్‌ యాదవ్‌, గ్రామకమిటీ అధ్యక్షులు వెంకటేశ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అలాగే మండల కేంద్రంలో పార్లమెంట్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి దేవ సుందరం, మండల పార్టీ అధ్యక్షులు స్వామిదాస్‌, ప్రధాన కార్యదర్శి జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో పింఛన్లు పంపిణీ చేశారు. గంగవరం: మండలంలో శనివారం వేకువజాము నుండి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడంతో వద్ధులు, వికలాంగులు, పింఛనుదారులు హర్షం వ్యక్తం చేశారు. ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ 90శాతం పూర్తి చేయడంతో పింఛనుదారులు సంతోషం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగస్తులు స్పందించి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు. వెదురుకుప్పం: మండలంలోని పెద్దపోటుచేను గ్రామంలో టిడిపి రాష్ట్ర సాంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి ఎన్‌.మునిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారం పింఛన్ల పంపిణీ జరిగింది. ఇందులో భాగం ప్రమాదంలో గాయపడి మంచాన ఉన్న భరత్‌కు రూ.15,000లు అందజేశారు. క్లస్టర్‌ ఇంఛార్జి కోనేరు చెంగల రాయరెడ్డి, సెక్రటరీ బూత్‌ కన్వీనర్‌ బి.హిమశేఖర్‌ రెడ్డి, బి.జయరామ్‌ రెడ్డి, బూత్‌ కన్వీనర్‌ రాజశేఖర్‌ వర్మ, వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు.కార్వేటినగరం: కార్వేటినగరంలో నియోజకవర్గ కాపు సంక్షేమ అధ్యక్షులు కె.ప్రసాద్‌ ఆధ్వర్యంలో పింఛన్‌ పంపిణి చేశారు. అలాగే కొల్లాగుంటలో వైస్‌ సర్పంచ్‌ విజయ, టిడిపి నాయకులు పవన్‌ కుమార్‌ పింఛన్లు పంపిణి చేశారు. సిడి కండిగాలో టిడిపి బూత్‌ కన్వీనర్‌ దాసరి గణేష్‌, చిన్న కుప్పారెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్‌, నరేష్‌ పింఛన్లు అందించారు. కార్వేటినగరం పరిసరాల ప్రాంతాలలో పొన్న యుగంధర్‌, రవి యాదవ్‌, జగన్నాథం, సందని, కేఎం పురంలో ధనంజయ రాజు, సోమశేఖర్‌ యాదవ్‌ పింఛన్లను అందించారు.పెద్దపెంజాణి: చలమంగళం పంచాయతీలోని ముద్దేపల్లి, వడ్డూరు, సుల్లేరు గుట్టలలో పింఛన్‌ దారులకు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పింఛన్లను పంపిణీ చేశారు. రామకుప్పం: మండలంలో ఎన్టీఆర్‌ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం వేకువజాము నుంచే అదికారులతో పాటు టిడిపి నేతలు, కార్యకర్తలు కలిసి చురుగ్గా నిర్వహించారు. టిడిపి నేతలు, కార్యకర్తలు అధికారులతో సమన్వయం చేసుకొని 90 శాతం పైగా పెన్షన్లు పంపిణీ చేశారు.

➡️