ప్రజాశక్తి-పూతలపట్టు: కర్ణాటక సూపర్ స్టార్ సినీనటుడు దివంగత సుమిత్ రాజ్ కుమార్ వర్ధంతి వేడుకలను మంగళవారం పూతలపట్టు మండల కేంద్రంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ రహదారిపై బాణాసంచాలు పేల్చారు. ఆయన చిత్రపటంతో పాటు మాజీ మాజీ వైస్ ఎంపీపీ దివంగత సుబ్బారెడ్డి చిత్రపటాన్ని కూడా ఏర్పాటుచేసి నివాళులర్పించారు. ప్రజల నుంచి కూడా రాజ్ కుమార్ అభిమానులకు సహాయ సహకారాలు అందాయి.