ఏళ్ల తర’బడి అద్దె భవనాల్లోనే..’

Oct 2,2024 21:27
ఏళ్ల తర'బడి అద్దె భవనాల్లోనే..'

అసౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులు
సొంత భవనాల్లేక పాఠశాల వరండాలోనే కాలం వెల్లదీస్తున్న వైనం
పట్టించుకొనేవారు కరువైయ్యారని వెల్లువెత్తుతున్న విమర్శలు
ప్రజాశక్తి-చిత్తూరు డెస్క్‌: నిండ్ర మండలంలో సొంత భవనాలు లేక అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. అరకొర సౌకర్యాల నడుమ పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల వరండా, అద్దె ఇండ్లలో అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. మండలంలో 18మిని, 37మెయిన్‌ అంగన్వాడీ కేంద్రాలు నిర్వహణలో ఉండగా అందులో 35కేంద్రాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. దాదాపు 531మంది చిన్నారులు ఆయా చోట్ల కేంద్రాలకు వస్తున్నారు.సౌకర్యాలు అంతంత మాత్రమే.. అద్దె భవనాల్లో కూడా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొన్ని చోట్ల నిరుపయోగంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనంలో అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. అక్కడ వర్షాలు కురిసినప్పుడు ఉరుస్తుండటంతో సెలవులు ప్రకటిస్తున్నారు. వేసవి కాలంలో ఎండ తీవ్రతకు, ఊక్కపొతకు పిల్లలు ఇబ్బందలు పడుతున్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. కనీసం ఫ్యాన్‌ సౌకర్యం కూడా లేదని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. మధ్యాహ్నం పూట పిల్లలు విశాంత్రి తీసుకోవడం కోసం సరైన వసతులు లేకపోవడంతో పిల్లలు తమ ఇళ్లకు వెళ్లిపోతున్నారు.పక్కా భవనాల నిర్మాణమెప్పుడో.. అరకొర సౌకర్యాలతో అద్దె భవనాల్లో కాలం వెల్లదీస్తున్న పరిస్థితి. పక్కా భవనాలు నిర్మించి పిల్లలు సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు. కానీస వసతులు లేక పిల్లల హజరు సంఖ్య తగ్గుతోందని, ఆ మేరకు అధికారులు చొరవ తీసుకొని పక్కా భవనాలను నిర్మించాలని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రస్తుతం అద్దె భవనాలు, పాఠశాలల్లో నడుస్తున్న చోట మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుకుంటున్నారు.

➡️