స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలన

స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలన

స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలనప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: పటిష్టమైన భద్రత నడుమ బ్యాలట్‌ బాక్స్‌ల స్ట్రాంగ్‌ రూమ్స్‌ 24గంటలు నిరంతరంగా పోలీసులు, కేంద్ర బలగాలతో బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. బుధవారం ఆయన ఎస్వీ సెట్‌ కళాశాలకు చేరుకొని స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించారు. జిల్లాలో ప్రాశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించిన జిల్లా పోలీసు యంత్రాంగానికి, ఇతర రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాలకు ఎస్పీ అభినందనలు తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం ఈవీఎం బాక్స్‌లను ఎస్‌వి సెట్‌ కాలేజీకి తరలించగా వాటిని భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లను ఎస్పీ మణికంఠ చందోలు అధికారులతో కలిసి కాలేజీ పరిసరాలను, పార్కింగ్‌ ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విధులు నిర్వహిస్తున్న అధికారులకు సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తూ కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతను కల్పించాలని, పటిష్టమైన భద్రత నడుమ ఈవీఎంలకు రక్షణ కల్పిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్‌ పూర్తి అయ్యేవరకు 144సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలో ఎవరైనా హింసాత్మకమైన ఘటనలకు పాల్పడిన, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున ఎక్కడ 5గురికి మించి గుంపులు, గుంపులుగా ఉండకూడదని, అనుమతులు లేకుండా ఎక్కడ సభలు, ప్రచారాలు నిర్వహించకూడదన్నారు. ఎవరైనా అతిక్రమించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, పెళ్లిళ్లు, అంత్యక్రియలకు మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు 144సెక్షన్‌ జిల్లాలో అమలవుతుందన్నారు. జిల్లా ప్రజలు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, దష్టిలో పెట్టుకోవాలన్నారు. ఎస్పీ తో పాటు అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ ఎస్‌.ఆరిఫుల్లా, చిత్తూరు సబ్‌ డివిజన్‌ డీఎస్పీ రాజగోపాల్‌ రెడ్డి, ఏఆర్‌ డిఎస్పీ మహబూబ్‌ బాషా, పూతలపట్టు ఇన్స్పెక్టర్‌ సుదర్శన ప్రసాద్‌, ఆర్‌ఐ నీలకంటేశ్వర రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

➡️