భవిష్య నిధికి వడ్డీ జమ చేయాలి జెడ్పీ సీఈవో గ్లోరియాకి యూటీఎఫ్‌ విజ్ఞప్

భవిష్య నిధికి వడ్డీ జమ చేయాలి జెడ్పీ సీఈవో గ్లోరియాకి యూటీఎఫ్‌ విజ్ఞప్

భవిష్య నిధికి వడ్డీ జమ చేయాలి జెడ్పీ సీఈవో గ్లోరియాకి యూటీఎఫ్‌ విజ్ఞప్తిప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: జెడ్పీ ఖాతా దారులకు గత 3ఏళ్లు వడ్డీ జమ చేయాలని యూటీఎఫ్‌ చిత్తూరు జిల్లా శాఖ జిల్లా పరిషత్‌ సీఈవోకు బుధవారం విన్నవించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల జెడ్పీ పిఎఫ్‌ ప్రొవిడెంట్‌ ఫండ్‌కు సంబంధించి 2019-2020 నుంచి నేటి వరకు ఎవరి ఖాతాలో ఎంత సొమ్ము ఉన్నది ఏ ఏ సంవత్సరంలో వడ్డీని జమ చేశారనే వివరాలు లేక సతమతమవుతున్నారని వారు తెలిపారు. వెబ్సైట్‌ పనిచేయడం లేదంటున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. అన్ని జిల్లా పరిషత్‌ సీఈఓలను సమాచారం కోరిన పంచాయత్‌ రాజ్‌, రూరల్‌ డెవలప్మెంట్‌ కమిషనర్‌ వారు 2021-22, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు వడ్డీని మంజూరు చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని కోరి ఉన్నారన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉద్యోగ ఉపాధ్యాయులకు 2019 నుంచి నేటి వరకు బూస్టర్‌ స్కీం కింద వడ్డీ జమ చేసి ఎవరి ఖాతాలో ఎంత నగదు నిల్వ ఉందో వివరాలను సమగ్రంగా తెలియపరచాలని విజ్ఞప్తి చేయడం జరిగిందని వారు వివరించారు. సీఈఓ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమగ్ర వివరాలను తెప్పించుటకు గూగుల్‌ ఫార్మ్‌ ద్వారా సమాచారం డిడిఓల నుంచి తెప్పించడానికి తగిన ఏర్పాట్లు చేశామన్నారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఏపిజిఎల్‌ఐ కార్యాలయంలో ఉన్న సమస్యలను ప్రాతినిధ్యం చేయడం జరిగిందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డిఈఓ సి.దేవరాజుని కలసి ఇటీవల జరిగిన పదవ తరగతి మూల్యాంకన సొమ్మును ఉపాధ్యాయులకు మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. అలాగే కార్యాలయంలో ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమశేఖర్‌ నాయుడు, ఎన్‌.మణి గండన్‌, కార్యదర్శులు డి.ఏకాంబరం, ఎం.పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

➡️