ప్రజాశక్తి- విజయపురం (నగరి) నియోజకవర్గ స్థాయిలో ఖాళీగా ఉన్న మినీ అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలు పోస్టులకు ఆర్డీవో వై.భవానీ శంకరి ఆధ్వర్యంలో మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. నగరి మండలం గ్రుండాజుకుప్పం దళితవాడలో అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుకు, బుగ్గఅగ్రహారంలో హెల్పర్ పోస్టుకు, నిండ్ర మండలం శ్రీరామాపురంలో మినీ కార్యకర్త పోస్టుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 3 పోస్టులకు గాను ఐదు మంది హాజరయ్యారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి కె.హైమావతి, నగరి అర్బన్ హెల్త్‌సెంటర్ వైద్యులు ఎయిల్ అరసన్, సీడీపీవోలు కష్ణవేణి, ఇ.జయంతి, ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు కరుణాకర్‌రెడ్డి, సుకన్య, శ్రీహరి పాల్గొన్నారు.