ప్రజాశక్తి దినపత్రిక వార్తకు స్పందన గ్రామంలో విచారణ చేస్తున్న అధికారి మల్లికార్జున్ రెడ్డి ప్రజాశక్తి- గంగవరం: మండలంలోని పసుపుతూర్పు పంచాయతీ మార్చేపల్లి గ్రామంలో నివాస స్థలాల అతి సమీపంలో కోళ్ల ఫారాలు ఉన్నాయని ప్రజాశక్తిలో ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది. దీంతో గురువారం మార్చేపల్లిలో అనుమతులు లేని 30 కోళ్లఫారాలు గ్రామం చుట్టుపక్కల ఉన్నాయని, వీటివలన గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అధికారులు గుర్తించారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్యాధికారి మల్లికార్జున్రెడ్డి బందంతో మార్చేపల్లిలో పర్యటించి గ్రామంలో ఉన్న కోళ్ల ఫారాలు ఇళ్ల మధ్యలోనే ఉన్నాయని నిర్ధారించి పై అధికారులకు నివేదిక పంపించినట్లు తెలిపారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.