అస్ఫియా అదశ్యంపైఅన్ని కోణాల్లో దర్యాప్తు..: ఎస్పీ11 బృందాలతో గాలింపు డాగ్ స్క్వాడ్ పరిశీలనప్రజాశక్తి- పుంగనూరు: పుంగనూరులో చిన్నారి అస్పియా అదశ్యంపై పోలీసులు అన్ని కొణాల్లో దర్యాప్తు చేస్తున్నారని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఉబేదుల్లా కాంపౌండ్‌లో ఉన్న వీధులను ఎస్పీ సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉబేదుల్లా కాంపౌండ్‌కు చెందిన అంజాద్ కుమార్తె అస్పియా (6) ఆదివారం ట్యూషన్‌కి వెళ్లి వచ్చి ఇంటి వద్ద ఆడుకుంటూ చిన్నారి అక్కడ అదశ్యమైందని తెలిపారు. ఏడు గంటలకు అదశ్యమైతే చిన్నారి బంధువులు, అక్కడ యువత ఆ ప్రాంతంలో అన్నిచోట్లను వెతికినా ఆచూకీ లేకపోవడంతో రాత్రి 10. 30 గంటలకు పోలీసు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులతో కలిసి యువత కూడా రాత్రంతా అన్ని ప్రాంతాలు తిరిగారిని కానీ ఆచూకి తెలీయలేదని పేర్కొన్నారు. దీంతో చిన్నారి అదశ్యం కేసు దర్యాప్తు కోసం 11ప్రత్యేక బందాలతో కోసం గాలింపు చేపట్టినట్టు చెప్పారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే డాగ్ స్క్వాడ్ పసిగట్టిన ప్రదేశాలను సందర్శించి వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. సీసీ కెమెరాల్లో కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఆర్థికపరమైన సమస్యలపై ఏమైనా జరిగాయని కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. త్వరలోనే అస్ఫియా ఆచూకీని లభిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.