ప్రజాశక్తి-పలమనేరు : చిత్తూరు జిల్లా పలమనేరులో గురువారం ఉదయం 10 గంటలకు టవర్ క్లాక్ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి వేడుకలు బీసీ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగినది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి మహాత్మ జ్యోతిరావు పూలే గారి సేవలను కొనియాడారు. మహాత్మ జ్యోతిరావు పూలే మహారాష్ట్ర పూణేలోని శూద్ర కులంలో 1827 ఏప్రిల్ 11న జన్మించి 13 వయేట సావిత్రిబాయితో వివాహం జరిగినా, ఆమెకు చదువు చెప్పించి ఉపాధ్యాయ వృత్తిలోకి రాణించి, సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక అసమానతలను వ్యతిరేకించి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వితంతు వివాహాల కోసం ఎంతో పోరాడి మహాత్మా అనే బిరుదు పొందిన మహనీయ వ్యక్తి అని, 1890 సంవత్సరం నవంబర్ 28వ తారీఖున పరమపదించారని, ఆయన సేవలు చిరస్మరణీయమని త్వరలో జ్యోతిరావు పూలే విగ్రహ స్థాపన ఏర్పాటుకు మున్సిపాలిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని బీసీ సంఘానికి భరోసా ఇచ్చారు. అద్దంకి రమణ మూర్తి మాట్లాడుతూ నియోజకవర్గాల వారి మండలాల వారి గ్రామ, గ్రామాన ఆశయాలు విస్తరించాలని గ్రామ కమిటీలను సైతం ఏర్పాటు చేస్తూ స్థానిక ప్రతినిధులు అఖిలపక్ష నాయకులు అందర్నీ కలుపుకొని బీసీల చైతన్యానికి ప్రయత్నిస్తున్నామని బీసీలలో రాజకీయ చైతన్యం కల్పించడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేశారు .ఈ కార్యక్రమంలో అద్దంకి రమణమూర్తి గోవిందస్వామి, డి త్యాగరాజులు , పంజాని వెంకటరమణ, నంజుండప్ప ఆనందగౌండర్, లక్ష్మీపతి యాదవ్, బండి రాజశేఖర్, రామ్మూర్తి,నాగరాజు గౌడు, సిపిఎం నాయకులు గిరిధర్ గుప్తా, టిడిపి బలరాం కుట్టి, బిజెపి నక్క రామచంద్రయ్య, ప్రభాకర్, తాతయ్య నాయుడు మొదలగు వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.