కష్టాల్లో తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ సిబ్బంది

Oct 30,2024 12:03 #Chittoor District

నాలుగు నెలల కాలంగా జీతం అందలేదు డ్రైవర్ల ఆవేదన
ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : అరవింద సమస్త ఆధ్వర్యంలో కొనసాగుతున్న తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ సిబ్బందికి జీతభత్యాలు 4నెలలుగా అందడం లేదని డ్రైవర్ల ఆవేదన నెలకు 7770 రూపాయలు జీతం ప్రభుత్వం ఫిక్స్ చేయడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వాలు మారిన తమ జీతాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టైంకు జీతాలు అందడం లేదని ఆగ్రహిస్తున్నారు. మాకు కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉందని, ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ సిబ్బందికి ప్రతి నెల జీతం అందేలా చూస్తూ తగిన వేతనం మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని  సిబ్బంది కోరుతున్నారు.

➡️