రాష్ట్ర విప్ గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్
ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం : ఎస్ఆర్ పురం మండలం తన సొంత మండలము అని అభివృద్ధియే ధ్యేయంగా పనిచేస్తానని డాక్టర్ వి ఎం థామస్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం కోలాటం, బ్యాండ్ మేళాలతో, క్రేన్ ద్వారా పెద్ద గజమాలతో ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కు నిరంజన్ రెడ్డి స్వాగతం పలికారు. పండగ వాతావరణం నెలకొంది. మండలంలోని 52 కనికాపురంలో 74 లక్షలతో నూతనంగా నిర్మించిన బిటి రోడ్డు 52 కనికాపురం రోడ్డును ప్రారంభించారు. అనంతరం గత 40 సంవత్సరాలుగా ఈ రోడ్డు అధ్వానంగా ఉండడంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. అందుకే ఈ బీటీ రోడ్డును ప్రారంభించాము అని అన్నారు. అలాగే జిల్లాలోని ఎక్కువ నిధులతో ప్రజా సౌఖ్యరార్థం సిసి రోడ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. దాదాపు గంటసేపు పరిసరాల ప్రాంతాల వారి సమస్యలను విని పరిష్కార మార్గం చూపారు. జంగాలపల్లి తిరుపతి బస్సు సర్వీస్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం రావాలని స్థానికులు కోరడంతో పుత్తూరు డిపో డిఎంతో ఫోన్ ద్వారా మాట్లాడించి పరిష్కార మార్గం ఏర్పాటు చేశారు. ముస్లింల వివాహం కోసం షాది మహల్ మంజూరు చేయాలని ముస్లిం మహిళలు సోదరులు కోరడంతో కలెక్టర్ తో మాట్లాడి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. స్థానికంగా రోడ్డు వెడల్పు చేయాలని మహిళలు కోరడంతో వెంటనే స్పందించి ఆ రోడ్డును కూడా సిసి రోడ్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు, గంధమనేని రాజశేఖర్ నాయుడు, నిరంజన్ రెడ్డి, తహసిల్దార్ లోకనాథ పిల్లై ఎంపీడీవో మోహన్ మురళి, కార్వేటి నగర్ సిఐ హనుమంతప్ప ఎస్సై సుమన్ మండల స్థాయి అధికారులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.