ప్రజాశక్తి-పలమనేరు : చిత్తూరు జిల్లా పలమనేరు లోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో రత్నారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకొని నూతన సంవత్సర క్యాలెండర్లు డైరీలను ఆవిష్కరించడం జరిగినది. విశ్రాంత ఉద్యోగులందరూ సకాలంలో తమ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాలని,విశ్రాంత ఉద్యోగులకు రావాల్సినటువంటి పెన్షన్ బకాయిలు రెండవ పిఆర్సి వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న ఫెడరల్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మేనేజర్లు తమ కార్యాలయాల్లో సీనియర్ సిటిజనులకు ప్రత్యేక ఆకర్షణీయమైన లాభాలు చేకూర్చే స్కీములు, ఆస్తి పన్ను మినహాయింపు స్కీములు కలవని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరినారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు ట్రెజరర్లు తోపాటు ఎక్కువ సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.