ఉచిత వైద్య శిబిరానికి అపూర్వస్పందన

May 25,2024 14:59 #Chittoor District

ప్రజాశక్తి-ఎస్ఆర్ పురం: మండలంలోని తయ్యూరు పాయకట్టు అంకనపల్లె ధర్మరాజులు దేవస్థానం వద్ద ఆర్వీఎస్ చిత్తూరు ఆసుపత్రి వారు శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. డాక్టర్ ఖలీద్, డాక్టర్ భవిత ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన రోగులకు వైద్య సేవలు అందించారు. దాదాపు 100 మందికి బిపి, షుగర్ పరీక్షలు నిర్వహిం చారు. సాధారణ వైద్య పరీక్షలు, ఆర్తో, గైనకాలజీ లాంటి జబ్బులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని గుర్తించి తమ ఆసుపత్రిలో చేరాలని సూచించారు. వీరికి ఉచిత బస్సుతోపాటు వైద్య సేవలు ఉచితంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మాలతి, జ్యోతిక, సుబ్రమణ్యం, వరకుమార్ యోగ ఆచార్యులు గోవింద స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️