పకడ్బందీగా పిసిపిఎన్‌డిటి చట్టం

Nov 28,2024 22:41
పకడ్బందీగా పిసిపిఎన్‌డిటి చట్టం

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: గర్భస్థ లింగనిర్ధారణ చట్టరీత్యా నేరమని, పిసిపిఎన్‌డిటి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ సమిత్‌ కుమార్‌ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్‌ ఛాంబర్‌లో పిసిపిఎన్‌డిటి చట్టంపై జిల్లా స్థాయి మల్టీ మెంబర్‌ అప్రా ప్రియేట్‌ అథారిటీ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది. కలెక్టర్‌ మాట్లాడుతూ కొన్ని స్కానింగ్‌ సెంటర్ల వారు గర్భిణీ స్త్రీకి లింగ నిర్ధారణ చేసి అబార్షన్‌కు కారకులవుతున్నారని, దీనిని రూపు మాపేందుకు డెకారు ఆపరేషన్లు తప్పక చేపట్టాలని తెలిపారు. ఆశా కార్యకర్తలు డెకారు ఆపరేషన్లు ద్వారా లింగ నిర్ధారణ చేసినట్లు స్కానింగ్‌ సెంటర్ల వారిని పట్టిస్తే లక్ష రూపాయలు బహుమానం ఇస్తానని, అలా జిల్లాలో ఐదు మందికి ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ఆశా కార్యకర్తలు వినియోగించుకోవాలని తెలిపారు. లింగ నిర్ధారణ అనేది చట్టరీత్యా నేరం ప్రభుత్వ ఆదేశాల నిబంధనలకు లోబడి స్కానింగ్‌ సెంటర్లు నడవాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఓ ప్రభావతి దేవి, ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకట ప్రసాద్‌, డిఐఓ డాక్టర్‌ హనుమంతరావు, డాక్టర్‌ శిరీష తదితరులు పాల్గొన్నారు.

➡️