రాష్ట్రస్థాయిలో విద్యార్థుల ప్రభంజనం

Nov 28,2024 22:34
రాష్ట్రస్థాయిలో విద్యార్థుల ప్రభంజనం

ప్రజాశక్తి- యాదమరి: జోనల్‌ స్థాయి నాలుగవ డివిజన్‌ స్థాయిలో ఎనిమిది జిల్లాలు పోటీపడగా పూతలపట్టు నియోజకవర్గంకు చెందిన విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. యాదమరి మండలం కె.గొల్లపల్లె హైస్కూల్‌ నుంచి ధనుష్‌ దేశభక్తి గేయాలాపనలో మొదటిస్థానం, వరిగపల్లె హైస్కూల్‌ విద్యార్థి నారాయణ క్విజ్‌ పోటీల్లో ద్వితీయస్థానం, వ్యాస రచన పోటీల్లో బంగారుపాళ్యం మండలం మంగళపల్లె హేమశ్రీకి మొదటిస్థానం, వకృత్వ పోటీలో మంగళపల్లె విద్యార్థి హేమకు ద్వితీయస్థానం, ఐరాల మండలం పైపల్లె హైస్కూల్‌ విద్యార్థి రోహిత్‌కి వకృత్వ పోటీలో మొదటి స్థానం సాధించారని ఉపాధ్యాయులు షహానాజ్‌ బేగం, అరుణ శివపస్రాద్‌ తెలిపారు. గెలుపొందిన విద్యార్థులను ఆర్‌జెడి కడప విద్యాశాఖ అధికారి శ్యామూల్‌ అభినందించి బహుమతులు అందజేసినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులను పిఆర్‌టియు రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ కనకాచారి, భాస్కర్‌ రెడ్డి, హిమబిందు, స్వర్ణలత, ఎస్‌టియు జిల్లా అధ్యక్షులు మదన్‌ మోహన్‌ రెడ్డి, గుణశేఖర్‌, శివప్రసాద్‌, సురేష్‌ రెడ్డి, విశ్వనాథ్‌, మోహన్‌ కుమార్‌, కాంచన అభినందించారు.జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు లక్ష్మీ వి కోట: మండల పరిదిలోని పాముగానిపల్లి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జి.లక్ష్మీ జాతీయస్థాయి అండర్‌ 14 ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ రెడ్డి తెలిపారు. ఈనెల 23, 24, 25 తేదీల్లో పల్నాడు జిల్లా కారంపూడిలో జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో చిత్తూరు జిల్లా ప్రథమస్థానం సొంత చేసుకుంది. ఆ జట్టులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జి.లక్ష్మీని జాతీయస్థాయి జట్టుకు ఎంపిక చేశారు. ఈ విద్యార్థి త్వరలో మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటుందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. విద్యార్థికి తర్ఫీదు ఇచ్చిన పిడి సురేష్‌ బాబును ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.ఖోఖోలో పుదిపట్ల విద్యార్థుల హవా.. చౌడేపల్లి: మండలంలోని పంచాయతీ కేంద్రం పుదిపట్లలో గురువారం జరిగిన జిల్లా స్థాయి ్‌ఖోఖో క్రీడల్లో పుదిపట్ల విద్యార్థులు విజయం సాధించారు. సీనియర్‌ బాలుర విభాగంలో పుదిపట్ల మొదటి స్థానం, చౌడేపల్లి రెండవ స్థానంలో నిలిచారు. సీనియర్‌ బాలికల విభాగంలో పుదిపట్ల మొదటి స్థానం సాధించగా, రొంపిచెర్ల రెండో స్థానాన్ని సాధించారు. అదేవిధంగా జూనియర్‌ బాలుర విభాగంలో విజయవాణి ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి స్థానం, విజయవాడ ఐసిఎస్సి ద్వితీయ స్థానం, జూనియర్‌ బాలికల విభాగంలో ఒకటవ స్థానంలో పుదిపట్ల, రెండవ స్థానంలో మేలుపట్ల విద్యార్థులు నిలిచారు. ఖోఖో క్రీడల్లో జిల్లాస్థాయి నుంచి 25 టీములు పాల్గొన్నారు. ఎంఈఓ కేశవరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, పీఈటీ రామచంద్రయ్య, పాఠశాల కమిటీ చైర్మన్‌ మనోహర్‌ రెడ్డి, గ్రామస్తులు వినోద్‌ కుమార్‌ రెడ్డి, ఉదరు కుమార్‌ రెడ్డి, రాజారెడ్డి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీకి వెంకట్‌ ఎంపిక విజయపురం: మండలం, ఇల్లత్తూరు గ్రామానికి చెందిన వెంకట్‌ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీకి ఎంపిక చేసినట్లు తిరుపతి ఏస్వీ యూనివర్శిటీ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 18వ తేదీ కేరళలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో వెంటక్‌ పాల్గొంటరాని ఆ ప్రకటనలో తెలిపారు. వెంకట్‌ ఎంపిక పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

➡️