విద్యుత్తు అధికారుల దాడులు

విద్యుత్తు అధికారుల దాడులు

విద్యుత్తు అధికారుల విస్తత్త దాడులుప్రజాశక్తి- కార్వేటినగరం విద్యుత్‌ చోరీపై అధికారులు విస్తత్త దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు విజిలన్స్‌ విభాగం ఈఈ బాలాజీ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో విస్తత్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్‌ ఏడీగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈఈ బాలాజీ మాట్లాడుతూ కార్వేటినగరం పరిధిలో ఎక్కువగా అక్రమ విద్యుత్‌ వాడకం చేపడుతూ విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నట్లు అందిన సమారం మేరకు దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. కార్వేటినగరం పెద్దదళితవాడ వద్ద ఏర్పాటు చేసిన వాలీబాల్‌ క్రీడా మైదానానికి ఏర్పాటు చేసిన అక్రమ విద్యుత్‌ కనెక్షన్ను తొలగించి వాటికి వినియోగించిన విద్యుత్‌ వైయర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే నగరంలో దుకాణలపై విస్తత్తంగా దాడులు నిర్వహించి సుమారు 35 అడిషనల్‌ లోడ్డు కేసులు నమోదు చేయడమే కాకుండా 3మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు చేసి రూ.లక్ష వరకు జరిమాన విధించడం జరిగిందన్నారు. కార్వేటినగరం డివిజన్‌ పరిధిలో ఎక్కడైనా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నట్లు తెలిసిన వెంటనే 94408 11820 ఏడీఈ నాగరాజుకు, 94408 11821 ఏఈ రియాజ్‌ అహ్మద్‌ నంబర్లకు సమాచారం అందించి విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. వారి వెంట విజిలన్స్‌ విభాగం ఏఈలు హరి, కష్ణయ్య. రాజ పలువురు విద్యుత్‌ సిబ్బంది ఉన్నారు.

➡️