ప్రజాశక్తి – చిత్తూరు అర్బన్: జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ డీఎస్పీగా రాంబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన డీఎస్పీల సాధారణ బదిలీలో భాగంగా చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు డీఎస్పీగా రాంబబు బదిలీ పై వచ్చి గురువారం తన కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత ఎస్‌పి కార్యాలయంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.