ప్రజాశక్తి-చిత్తూరు: చిత్తూరు గిరింపేట దుర్గమ్మ ఆలయం నుంచి కొత్త కలెక్టర్ ఆఫీస్ వరకు ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం మంగళవారం చేపట్టారు.చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ ఆదేశాల మేరకు..రోడ్ లో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని అనధికార దుకాణాలు,తోపుడు బండ్లు,తదితర వాటిని తొలగించినట్లు అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర తెలిపారు. ఈ తొలగింపు కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి శుభప్రద మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.