మాతా శిశు మరణాలపై సమీక్

మాతా శిశు మరణాలపై సమీక్

మాతా శిశు మరణాలపై సమీక్షప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: మాతా శిశు మరణాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభావతి దేవి బుధవారం డిఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్‌ నెలలో 13 శిశు మరణాలు 1 మాత మరణంపై కేసుల వారిగా వైద్యాధికారి, పర్యవేక్షకులు, ఏఎన్‌ఎం, ఆశ, అంగన్‌ వాడి కార్యకర్తలతో ముఖాముఖిగా చర్చించి భవిష్యత్‌లో మాత మరణాలు జరగకుండా, నివారణ చర్యలు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని ఆదేశించారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ కేసులు హార్ట్‌ అరెస్ట్‌తో చనిపోతున్నారు. కావున ప్రతి గర్భిణీకి ఈసీజీ పరీక్ష, ఈసీజీలో ఇబ్బందులు ఉంటే ఎకో పరీక్షల ద్వారా ముందుగానే గుర్తించి వారికి తగిన చికిత్స చేయుట, రక్తహీనత రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తతో మాత మరణాలకు లేకుండా చూడొచ్చు, ప్రతి గర్భిణీ స్త్రీకి ఉచిత వైద్యం ప్రభుత్వం నందు, ప్రైవేట్‌ నందుగానీ ఆరోగ్యశ్రీ ద్వారా జెఎస్‌ఎస్‌కె తప్పక ఉపయోగించుకుని అందించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ స్థాయిలోని హైరిస్క్‌ గర్భవతులకు అన్నీ పరీక్షలు నిర్వహించి ప్రణాళిక ద్వారా కాన్పుకు వారం రోజులు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రి నందు చేర్పించిన యెడల వారికి ఆర్థిక రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. మొదటిసారి గర్భం దాల్చిన గర్భవతులపై వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. బిడ్డబిడ్డకు కనీసం మూడు సంవత్సరములు కాల వ్యవధి ఉండేలా గర్భవతులకు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి ఏదో ఒక కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులను అవలంబించేటట్లు చేయుట ద్వారా మాతమరణాలను తగ్గించాలన్నారు. తల్లికి అధిక రక్తపోటు, రక్తహీనత, పౌష్టికాహార లోపం వలన కాన్పు సమయంలో జరిగే మాత మరణాలను వైద్యాధికారులు ముందస్తు ప్రణాళికల ద్వారా నివారించాలని, సరైన పద్ధతిలో కౌన్సిలింగ్‌ చేయాలని తెలిపారు. కాన్పు అయిన తరువాత వైద్యులు వైద్య సిబ్బంది బాలింతలను సందర్శించి తల్లి, బిడ్డ యొక్క ఆరోగ్య సమస్యలను గుర్తించి తగిన చికిత్సలు అందించి మాత, శిశు మరణాలు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఉషశ్రీ, డాక్టర్‌ లత, డాక్టర్‌ మాలతి, డాక్టర్‌ దీప, డాక్టర్‌ జానకిరావు, డాక్టర్‌ శిరీష పాల్గొన్నారు.

➡️