పనులకు 60 వేల రూపాయల నిధులు విరాళం
ప్రజాశక్తి – సోమల: మండల కేంద్రమైన సోమలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు 1981 82 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఇటీవల గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు నగదు రూపంలో విరాళం ఇవ్వాలని అనుకొని ఈ దినము అనగా ఆదివారం 60 వేల రూపాయల నగదును పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అందజేశారు. విరాళంగా ఇచ్చిన నగదును విద్యార్థులు త్రాగే ఆర్వో ప్లాంట్ మిషనరీ కి భద్రత కోసం ఖర్చు చేయనున్నట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విజయలక్ష్మి ఉమా శంకర్ షకీల్, రమాపతి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.